యువగళంలో వైసీపీ కవ్వింపు చర్యలు
ABN , First Publish Date - 2023-09-04T04:02:59+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై వైసీపీ రౌడీ మూకలు దాడి చేశాయి.
మందలపర్రులో పాదయాత్రపై రాళ్లదాడి
టీడీపీ నాయకులకు గాయాలు, కార్ల అద్దాలు ధ్వంసం
నిడమర్రు, సెప్టెంబరు 3: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై వైసీపీ రౌడీ మూకలు దాడి చేశాయి. పాదయాత్రను ఆటంకపరచాలనే దురుద్దేశంతో వైసీపీకి చెందిన అల్లరి మూకలు దాడి చేశాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఆదివారం యువగళం పాదయాత్ర ఏపీలోని ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలపర్రుకు రాగానే కొందరు వైసీపీ కార్యకర్తలు టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాదయాత్రలో ఉన్న వారిమీదకు వచ్చారు. రెండు పార్టీల నాయకుల మధ్య తోపులాటలు జరిగాయి. కొందరు వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడులు చేయడంతో కొంత మంది టీడీపీ నాయకులకు గాయాలయ్యాయి. కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసుల రాకతో ఘర్షణ సద్దుమణిగింది. అనంతరం టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం ఫిర్యాదులు చేశాయి. లోకేశ్ పాదయాత్రకు వస్తున్న విశేష ఆదరణను ఓర్వలేకనే వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు.