రూ.60 లక్షల విలువైన.. 210 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2023-06-27T01:36:12+05:30 IST

గంజాయిని రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని శంషాబాద్‌ ఎస్‌ఓటి, మేడ్చల్‌ పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రూ. 60 లక్షల విలువ చేసే 210 కిలోల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు.

రూ.60 లక్షల విలువైన..  210 కిలోల గంజాయి పట్టివేత

ఒకరి రిమాండ్‌.. ముగ్గురి పరారీ

పేట్‌బషీరాబాద్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): గంజాయిని రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని శంషాబాద్‌ ఎస్‌ఓటి, మేడ్చల్‌ పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రూ. 60 లక్షల విలువ చేసే 210 కిలోల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్‌ జోన్‌ డీసీపీ సందీ్‌పరావు, ఎస్‌ఓటీ సీఐ సత్యనారాయణరెడ్డి, మేడ్చల్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు. నల్గొండ జిల్లా చందుపేట మండలం గుంటు కుండి తండాకు చెందిన జర్పాల తిరుపతి(20) బతుకుదెరువు కోసం వలస వచ్చి, రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్‌లోని బీఎన్‌రెడ్డినగర్‌లో నివాసముంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

ఈ నెల 25న పక్కా సమాచారంతో శంషాబాద్‌ ఎస్‌ఓటీ, మేడ్చల్‌ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో మేడ్చల్‌ చెక్‌పోస్టు నుంచి అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు వెళ్లేదారిలో టీఎ్‌స22హెచ్‌4835 నెంబరు గల కారును తనిఖీ చేశారు. అందులో 210 కిలోల గంజాయి ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు తిరుపతిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఒడిశాలోని బెర్హంపూర్‌ ప్రాంతంలో సాగుదారుల నుంచి ఏ-1 సీతారామ్‌ గంజాయిని సేకరించి అక్రమంగా నిల్వ ఉంచుకుంటాడు. ఏ-2 మార్తునాయక్‌ సీతారామ్‌ వద్ద గంజాయిని కొనుగోలు చేసి, కారులో మహారాష్ట్రకు తరలించి, ఏ-3 శివకు అప్పగిస్తున్నట్లు తిరుపతి పోలీసుల విచారణలో వెల్లడించాడు. కాగా తిరుపతి నుంచి రూ.60 లక్షలకు పైగా విలువైన 210 కిలోల గంజాయి, కారును స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్‌కు తరలించామని డీసీపీ సందీ్‌పరావు తెలిపారు. అలాగే పరారీలో ఉన్న ముగ్గురు నిందితులపై ఇప్పటికే పలు కేసులున్నాయని వెల్లడించారు.

Updated Date - 2023-06-27T01:36:12+05:30 IST