Share News

సమన్వయంతో పనిచేయాలి : ఎమ్మెల్యే కుంభం

ABN , Publish Date - Dec 24 , 2023 | 12:13 AM

ప్రభుత్వ పథకాల అమలుకోసం ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా పనిచేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.

సమన్వయంతో పనిచేయాలి : ఎమ్మెల్యే కుంభం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

భూదాన్‌పోచంపల్లి, డిసెంబరు 23: ప్రభుత్వ పథకాల అమలుకోసం ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా పనిచేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన అబివృద్ధి కార్యక్రమాలను త్వరి తగతిన పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం సాధించే దిశగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు త్వరిత గతిన పూర్తి చేసి లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ కోట పుష్పలత, వైస్‌ ఎంపీపీ పాక వెంకటేశంయాదవ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ బాత్క లింగస్వామియాదవ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కందాడి భూపాల్‌రెడ్డి, ఎంపీడీవో బాలశంకర్‌, తహసీల్దారు బి వీరాబాయి, పీఆర్‌ ఏఈ వెంకటేశం, విద్యుత్‌ ఏఈ క్రాంతి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ హరీష్‌, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండల వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫాస్టర్లు ఆర్‌ ఇజ్రాయిల్‌, తిమోతి, జాకబ్‌రాజ్‌, సీవీ ఇజాక్‌, కేపీ మోజెస్‌, సుధాకర్‌, యేసురత్నం, మేరీ, శ్రీనివాస్‌పీటర్‌, జాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 12:13 AM