Kumaram Bheem Asifabad:దివ్యాంగుల సంక్షేమానికి కృషి
ABN , Publish Date - Dec 14 , 2023 | 10:20 PM
దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ హేమంత్‌బోర్కడే అన్నారు.
ఆసిఫాబాద్ రూరల్, డిసెంబరు 14: దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ హేమంత్‌బోర్కడే అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆదర్శ బాలికల క్రీడ పాఠశాల మైదానంలో జిల్లా సంక్షేమాధికారి సావిత్రి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవితో కలిసి జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడలను దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. 10 నుంచి 16 సంవత్సరాల వరకు దివ్యాంగులకు పరుగు పందెం, షార్ట్‌ఫుట్, క్యారమ్, చెస్, జావెలెన్ త్రో క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వివిధ స్థాయిలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నామన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి మీనారెడ్డి, ఏపీడీఓ క్షేద్రయ్య, సంక్షేమాధికారులు, పీడీలు, పీఈటీలు, తదితరులు పాల్గొన్నారు.