వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:35 AM
‘రానున్న ఎన్నికల్లో నేను ఎంపీగా కాని, ఎమ్మెల్యేగా కానీ పోటీ చేయడం లేదు. జనసేన పార్టీ బలోపేతం కోసం మాత్రమే పనిచేస్తా’’ అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు తెలిపారు.
నెల్లూరు(స్టోన్‌హౌ్‌సపేట), డిసెంబరు 17: ‘‘రానున్న ఎన్నికల్లో నేను ఎంపీగా కాని, ఎమ్మెల్యేగా కానీ పోటీ చేయడం లేదు. జనసేన పార్టీ బలోపేతం కోసం మాత్రమే పనిచేస్తా’’ అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు తెలిపారు. రెండు రోజులుగా నెల్లూరు నగరంలోని రవీంద్రనాఽథ్ ఠాగూర్ హాల్‌లో జరుగుతున్న సమీక్ష సమావేశం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా నాగబాబు మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, ‘‘సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వైనాట్ 175 అంటున్నారు. అసలు ప్రతిపక్షమే ఉండకూడదు అనుకునే ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు. మేము కూడా వైనాట్ వైసీపీ జీరో అంటాం. జనసేన నాయకులు, కార్యకర్తలు, చిరంజీవి యువత, అభిమానుల్లో ఉత్సాహం, ఉత్తేజం నింపేందుకు జిల్లాకు వచ్చా. నా కుటుంబం తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదు. మంగళగిరిలో ఓటు హక్కు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఆంధ్రలోనే ఓటు వేస్తాం. ఓ కామెడి పత్రిక అసలు విషయాలు తెలుసుకోకుండా వార్తలు ప్రచురిస్తుంది. నిజాలు తెలుసుకోవాలి.’’ అని నాగబాబు అన్నారు.