డబ్బులు ‘సరెండర్‌’ చేసేదెప్పుడు?

ABN , First Publish Date - 2023-05-26T04:11:16+05:30 IST

హైదరాబాద్‌లో పోలీసు సిబ్బందికి ‘సరెండర్‌’ డబ్బులు సకాలంలో అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

డబ్బులు ‘సరెండర్‌’ చేసేదెప్పుడు?

హైదరాబాద్‌లో పోలీసుల ఎదురుచూపు

హైదరాబాద్‌ సిటీ, మే 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో పోలీసు సిబ్బందికి ‘సరెండర్‌’ డబ్బులు సకాలంలో అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారాలు, సెలవులు, పండగలు... ఇతర ముఖ్యదినాల్లో సైతం పోలీసులు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దానికోసం వారికి సరెండర్‌ (ప్రభుత్వ ఉద్యోగుల్లో కొన్ని విభాగాలకు వర్తిస్తుంది) పద్ధతి ద్వారా సెలవులు లేదా డబ్బులు ఇస్తుంటారు. అంటే ప్రతి ఏడాది రెండు సరెండర్‌లు ఉంటాయి. ఒక్కో సరెండర్‌ ద్వారా 15 రోజుల జీతం అదనంగా ఇస్తుంటారు. వీటిని జనవరి– జూలై నెలల్లో అందజేస్తారు. దానికి తోడు వారికి ప్రతి ఏడాది జమయ్యే 30 ఈఎల్స్‌ (ఎర్న్‌డ్‌ లీవ్స్‌)లో 15రోజులకు ఎన్‌క్యాష్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంటే నవంబరులో 15 రోజుల సెలవులకు సంబంధించి ఎన్‌క్యాష్‌ చేసుకుంటే వారికి ఆ డబ్బు కూడా ఇస్తారు. అయితే గతేడాది జూలై, నవంబరు, ఈ ఏడాది జనవరికి సంబంధించిన డబ్బులు చాలా మంది సిబ్బందికిఅందలేదు.

Updated Date - 2023-05-26T04:11:16+05:30 IST