Share News

హామీలు అమలుచేసి తీరుతాం

ABN , Publish Date - Dec 22 , 2023 | 12:10 AM

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాం గ్రెస్‌ ప్రభుత్వం అమలుచేసి తీరుతుందని నీటిపారుదల, సివిల్‌ సప్ల య్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

హామీలు అమలుచేసి తీరుతాం

సీపీఐ జిల్లా ప్రతినిధుల బృందానికి మంత్రి ఉత్తమ్‌ హామీ

హుజూర్‌నగర్‌, డిసెంబరు 21: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాం గ్రెస్‌ ప్రభుత్వం అమలుచేసి తీరుతుందని నీటిపారుదల, సివిల్‌ సప్ల య్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్‌, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లుతోపాటు 23 మండలాల ప్రతినిధులు, జిల్లా కమిటీ సభ్యు లు హైదరాబాద్‌లోని ఉత్తమ్‌ నివాసంలో కలిసి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా హుజూర్‌ నగర్‌, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి ని యోజకవర్గాల్లోని ప్రధాన సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరా రు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ ప్రాధాన్యక్రమంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె స్‌తో సీపీఐ కలిసి పోటీచేసి మంచి ఫలితాలు సాధించిందన్నారు. ఆరు గ్యారంటీలతో పేదల జీవితాలలో కొత్త వెలుగులు నిండుతాయన్నారు. సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు సలహాలు, సూచనలు అం దించాలన్నారు. వాటిని స్వీకరించి సమస్యల పరిష్కారానికి చొరవ చూ పుతామన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే హామీల అమలుకు శ్రీకా రం చుట్టామన్నారు. త్వరలోనే రూ.500లకు గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామన్నారు. రేషన్‌కార్డులు కూడా మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ ప్రతినిధులు యల్లావుల రాములు, గుండు వెంకటేశ్వర్లు, ఉస్తెల సృజన, ఉస్తెల నారాయణరెడ్డి, మేకల శ్రీనివాస్‌, దేవరం మల్లేశ్వరి, పోకల వెంకటేశ్వర్లు, మండవ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 12:10 AM