ముదురుతున్న మునుగోడు జగడం
ABN , First Publish Date - 2023-05-02T00:27:01+05:30 IST
మునుగోడు నియోజకవర్గ బీఆర్‌ఎ్‌సలో కోల్డ్‌వార్ ముదురుతోంది. ఉప ఎన్నికకు ముందు ఆ పార్టీ నాయకుల మధ్య ఎంత తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నాయో మళ్లీ అంతకు రెట్టింపు స్థాయిలో ముఖ్య నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ప్రధానంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు మరింత దూరం పెరుగుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఎమ్మెల్యే కూసుకుంట్ల, ముఖ్య నాయకుల మధ్య విభేదాలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రారంభానికి పలువురు డుమ్మా
సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న ‘మునుగోడు’ రాజకీయం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): మునుగోడు నియోజకవర్గ బీఆర్‌ఎ్‌సలో కోల్డ్‌వార్ ముదురుతోంది. ఉప ఎన్నికకు ముందు ఆ పార్టీ నాయకుల మధ్య ఎంత తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నాయో మళ్లీ అంతకు రెట్టింపు స్థాయిలో ముఖ్య నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ప్రధానంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు మరింత దూరం పెరుగుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఉప ఎన్నిక రాకముందు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా మునుగో డు నియోజకవర్గంలోని పలువు రు నాయకులు ఆయన నాయకత్వా న్ని వ్యతిరేకంచారు. ఆయనకు టికెట్ ఇవ్వకూడదని తమకు ఇవ్వాలంటూ పలువురు నాయకులు పార్టీ అధిష్ఠానాని కి విజ్ఞప్తులు చేసి నియోజకవర్గంలో పెద్దఎత్తున పర్యటించిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మె ల్యే పదవికి అనూహ్యంగా రాజీనామా చేసి బీజే పీ నుంచి బరిలోకి దిగిన అనంతరం బీఆర్‌ఎస్ టికెట్ ఎవరికి కేటాయిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. నామినేషన్ వేసే వరకు కూడా బీఆర్‌ఎస్ అధిష్ఠానం నాన్చుడు ధోరణి అవలంబించి అందరూ వ్యతిరేకించినా చివరకు సర్వేలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే అనుకూలత ఉంద న్న ఆలోచనతో ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభాకర్‌రెడ్డికి టికెట్ కేటాయించడంతో నిరాశ చెందిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరారు. ఆ తర్వాత కూడా అసమ్మతి తీవ్ర స్థాయిలోకి రాకుం డా ఉండేందుకు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, మంత్రి జగదీ్‌షరెడ్డి రంగంలోకి దిగి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులంతా ఏకతాటిపైకి తీసుకువచ్చి పటిష్ఠమైన మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కొన్నారు. .
వార్డు స్థాయికి చేరిన గ్రూపు తగాదాలు
మునుగోడు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, చౌటుప్పల్ మునిసిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, కర్నాటి విద్యాసాగర్, నారబోయిన రవి, కంచర్ల కష్ణారెడ్డి వంటి నాయకులు మునుగోడు ఉప ఎన్నిక రాకముందే 2023 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో పెద్దఎత్తున పర్యటించి తమ అనుచరులను కూడగట్టారు. అయితే అనూహ్యంగా మునుగోడు ఉప ఎన్నిక రావడంతో వీరంతా తమకున్న పరిచయాలతో రాష్ట్ర నాయకత్వాన్ని మచ్చిక చేసుకుని మునుగోడు టికెట్ పొందే ప్రయత్నం చేసినా అది బెడిసికొట్టింది. మొత్తానికి మంత్రులు కేటీఆర్, జగదీ్‌షరెడ్డిల మంత్రాంగంతో అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన తర్వాత అభివృద్ధివైపు దృష్టిసారించారు. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ డివిజన్ మినహా మిగతా హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. అయినప్పటికి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ ఏకతాటిపైకి రాలేకపోతుందనేది స్పష్టం అవుతుంది. ఇటీవల మునుగోడులో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్లీనరీకి ముఖ్య నాయకులంతా గైర్హాజరు కావడం సంచలానికి దారి తీసింది. ప్రధానంగా వార్డు స్థాయికి గ్రూపు తగాదాలు చేరుకోవడంతో మునుగోడు రాజకీయం గందరగోళంలో పడిపోయింది. మరో నాలుగు నెలలు అయితే సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనకు అధిష్ఠానం అండ ఉన్న నేపథ్యంలోనే ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఒంటరిగానే రాజకీయాలను కొనసాగిస్తూ ఎమ్మెల్యేగా నియోజకవర్గం లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్లీనరీ వంటి సమావేశానికి ముఖ్య నేతలు గైర్హాజరు కావడం చర్చకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఫొటోను కనీసం నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో ముద్రించకపోవడం కూడా రాజకీయ దుమారానికి దారి తీస్తోంది.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రారంభానికి దూరం
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హయాంలో మునుగోడు మండల కేంద్రంలో నిర్మాణం ప్రారంభమైన ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయం అసంపూర్తిగా ఉండడంతో ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఉప ఎన్నికలో విజయం సాధించిన అనంతరం ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పూర్తి చేయించారు. సోమవారం మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి ద్వారా ఆ కార్యాలయ ప్రారంభో త్సవం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నుంచి తమకు ఆహ్వానం లేదని, ముఖ్య నాయకులు బాహాటంగా పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. క్యాంపు కార్యాలయ ప్రారంభానికి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో పాటు వెన్‌రెడ్డి రాజు, నారబోయిన రవి, జడ్పీటీసీ నారబోయిన స్వరూపరాణితో పాటు చండూరు ఎంపీపీ పల్లె కళ్యాణితో పాటు పల్లె రవి ఇంకా వివిధ మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు. చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, మర్రిగూడ, నాంపల్లి, చండూరు, గట్టుప్పల్ మండలాలకు చెందిన చాలా మంది ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరుకానట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులంతా భారీగా రావాల్సి ఉన్నా ఎందుకు ఇంత ముఖ్యమైన కార్యక్రమానికి హాజరుకాలేదనేది సందేహంగా మారింది.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి
మునుగోడు, ఏప్రిల్ 1: మునుగోడులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి ఎమ్మెల్యే కూసుకంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించా రు. మంత్రితో కలిసి క్యాంపు కార్యాలయంలో మంత్రితో కలిసి ఆశీనులైన ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి కల్యాణలక్ష్మి పథకం మం జూరు కోసం అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులపై సంతకం చేశారు. కార్యక్రమంలో మునుగోడు, మర్రిగూడ ఎంపీపీలు కర్నాటి స్వామియాదవ్, మెండు మోహన్‌రెడ్డి చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ఆర్‌అండ్‌బీ ఏడీఈ రతన్‌గౌడ్, శిరీ్‌షకుమార్, మునగోడు, చండూరు, గట్టుప్పల మండలాల బీఆర్‌ఎస్ అధ్యక్షులు బండ పురుషోత్తంరెడ్డి, కస్తాల వెంకన్న, ఇడెం కైలా్‌షనేత, నాయకులు పగిళ్ల సతీష్, మందుల సత్యం, ఆకుల వెంకటయ్య, శ్రీను, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు.