Vijaya milk : విజయ పాల ధర లీటరుపై రూ. 3 పెంపు

ABN , First Publish Date - 2023-04-04T03:08:39+05:30 IST

విజయ పాల ధర మళ్లీ పెరిగింది. లీటరుకు గరిష్ఠంగా రూ. 3 పెంచుతూ తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య నిర్ణయం తీసుకుంది.

Vijaya milk : విజయ పాల ధర లీటరుపై   రూ. 3 పెంపు

టోన్డ్‌ మిల్క్‌ లీటరు ధర రూ.58

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): విజయ పాల ధర మళ్లీ పెరిగింది. లీటరుకు గరిష్ఠంగా రూ. 3 పెంచుతూ తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య నిర్ణయం తీసుకుంది. డబుల్‌ టోన్డ్‌ పాలధర అర లీటరుకు రూ.27 ఉండగా రూ.28కి పెరిగింది. టోన్డ్‌ మిల్క్‌ ధర లీటరు రూ.55 ఉండగా, రూ.58కి పెరిగింది. అలాగే రైతుల నుంచి సేకరించే పాల కొనుగోలు ధర కూడా పెంచారు. ఆవు పాలకు లీటరుకు రూ.4.60, గేదె పాలకు రూ.4 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు గత శనివారం నుంచే అమల్లోకి వచ్చాయని సమాఖ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2023-04-04T03:08:40+05:30 IST