రెండో రోజూ విజిలెన్స్ దాడులు
ABN , Publish Date - Dec 29 , 2023 | 03:37 AM
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను సకాలంలో అప్పగించకపోవడం, పౌర సరఫరాల శాఖ నుంచి తీసుకున్న ధాన్యం నిల్వలకు
మిల్లుల యజమానులపై కేసుల నమోదు
నల్లగొండ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను సకాలంలో అప్పగించకపోవడం, పౌర సరఫరాల శాఖ నుంచి తీసుకున్న ధాన్యం నిల్వలకు, మిల్లుల్లోని నిల్వలకు మధ్య వ్యత్యాసం వంటి సమాచారం మేరకు రెండు రోజులుగా నల్లగొండ జిల్లాలోని రైస్ మిల్లులపై విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం నల్లగొండలోని పానగల్లు ప్రాంతంలో ఓ మిల్లు, హాలియా మండలంలోని పాలెంలోని మరో బడా మిల్లుపై దాడులు నిర్వహించి ధాన్యం నిల్వలను లెక్కించారు. ఈ రెండు మిల్లుల్లో 87వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు కన్పించడం లేదని అధికారులు నిర్ధారించారు. రెండు మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేశారు. గురువారం మరో 3 మిల్లులపై తనిఖీలు నిర్వహించారు. నల్లగొండ పట్టణంతోపాటు హాలియా మండల కేంద్రంలోని మూడు మిల్లుల్లో గురువారం సాయంత్రం వరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.