వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్
ABN , First Publish Date - 2023-03-02T02:33:12+05:30 IST
పశుసంవర్థక శాఖ పరిధిలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్-ఏ, బీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులో మార్పులు చేసుకునేందుకు టీఎ్‌సపీఎస్సీ
పశుసంవర్థక శాఖ పరిధిలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్-ఏ, బీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులో మార్పులు చేసుకునేందుకు టీఎ్‌సపీఎస్సీ అవకాశం కల్పించింది. ఇప్పటికే వివరాలు నమోదు చేసిన దరఖాస్తుదారులు ఈనెల 4 నుంచి 6న సాయంత్రం 5 గంటల లోపు మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. ఈ అవకాశం ఒక్కసారికి మాత్రమే వర్తిస్తుందని టీఎ్‌సపీఎస్సీ ఒక ప్రకటనలో పేర్కొంది.