శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:59 PM
మండలంలోని తాళ్లవెల్లంల గ్రామ శివారులో సుమారు రెండు నెలల క్రితం తాజా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.
శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
చిట్యాలరూరల్, డిసెంబరు 17: మండలంలోని తాళ్లవెల్లంల గ్రామ శివారులో సుమారు రెండు నెలల క్రితం తాజా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... ఎన్నికల షెడ్యూల్ వచ్చే 10 రోజుల ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో సుమారు రూ.2కోట్ల నిధుల అంచనాతో తాళ్లవెల్లంల శివారు నుంచి మునుగోడు మండలం ఊకొండి వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు అప్పటి ఎమ్మెల్యే లింగయ్య శంకుస్థాపన చేశారు. గ్రామానికి చెందిన ఆకతాయిలు గ్రామశివారులో మద్యం తాగి రాత్రి సమయంలో శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం గ్రామస్థులు చూడగా శిలాఫలకం ధ్వసం చేసి ఉండటంతో బీఆర్‌ఎస్ నాయకులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ శంకుస్థాపన శిలాఫలకాన్ని ధ్వంసం చేయడాన్ని చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో అరాచకం ప్రారంభమైనట్లు స్పష్టమవుతుందని అన్నారు. ఆకతాయిల వల్ల అన్ని పార్టీల నాయకులకు చెడ్డపేరు వస్తుందని శిలాఫలకం ధ్వంసం చేయడం సరికాదని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పురావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అన్ని పార్టీలకు ఉందని నాయకులు పేర్కొంటున్నారు.