Share News

రెండు రోజుల్లో రెండు పథకాలు ప్రారంభం

ABN , First Publish Date - 2023-12-10T23:03:00+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు పథకాలను ప్రారంభిం చామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు.

రెండు రోజుల్లో రెండు పథకాలు ప్రారంభం
జడ్చర్ల ఏరియా ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

- జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

జడ్చర్ల, డిసెంబరు 10 : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు పథకాలను ప్రారంభిం చామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటిం చిన ఆరు గ్యారెంటీ పథకాలలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచిన ఆరో గ్య బీమా పథకాలను ప్రారంభించారు. జడ్చర్ల ఏరియా ఆసుపత్రిలో ఆదివారం ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించా రు. మహిళలకు ఉచిత ప్రయాణం చేసే బస్సును ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపే ద కుటుంబాలకు చెందిన ప్రజలు, రాష్ట్రంలోని నిమ్స్‌, యశోద వంటి మల్టీ స్పెషాలిటీ, కార్పొరేట్‌ ఆసుపత్రులలో నాణ్యమైన చికిత్స పొందేందుకు రూ.10లక్షల ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని ప్రారంభించుకున్నామన్నారు. జడ్చర్ల కొత్తబస్టాండు ఆవరణలో మహిళ లతో కలిసి బస్సులో ప్రయాణించారు. అంతకుముందు జడ్చర్ల పట్టణం లోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు, డీహెచ్‌ఎంవో డాక్టర్‌ కృష్ణ, డిప్యూటీ డీహెచ్‌ఎంవో డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, డాక్టర్‌ శివకాంత్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సోమశేఖర్‌, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందితో పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T23:03:02+05:30 IST