టీయూ కొత్త రిజిస్ట్రార్‌గా ప్రొ. కనకయ్య

ABN , First Publish Date - 2023-05-27T03:47:54+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయంలో పాలక మండలి (ఈసీ) సభ్యులు, వైస్‌ చాన్స్‌లర్‌ (వీసీ) మధ్య వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

టీయూ కొత్త రిజిస్ట్రార్‌గా ప్రొ. కనకయ్య

నిజామాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయంలో పాలక మండలి (ఈసీ) సభ్యులు, వైస్‌ చాన్స్‌లర్‌ (వీసీ) మధ్య వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈసీ సమావేశాలకు హాజరు కాని వీసీ రవీందర్‌ గుప్తా తానే పలు నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఈసీ అనుమతులు లేకుండానే శుక్రవారం కొత్త రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ కనకయ్యను నియమించారు. ఆయన్ను కొనసాగించాలని ఈసీ సభ్యులకు లేఖలు కూడా రాశారు. వీసీ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ప్రొ.కనకయ్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.

Updated Date - 2023-05-27T03:47:54+05:30 IST