అధికార పార్టీకి అనుకూలంగా పోలీసు వ్యవస్థ
ABN , First Publish Date - 2023-06-19T03:38:35+05:30 IST
అధికారంలో ఉండే పార్టీకి అనుకూలంగా పోలీస్ వ్యవస్థ మారుతోందని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు.
టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
హైదరాబాద్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉండే పార్టీకి అనుకూలంగా పోలీస్ వ్యవస్థ మారుతోందని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ప్రతిపక్ష నాయకులు నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే వారిని పోలీసు స్టేషన్లలో వేసి భయభ్రాంతులకు గురిచేస్తారని పేర్కొన్నారు. ఎన్నికలవేళ కేసులూ నమోదు చేస్తారని, ఈ తరుణంలో న్యాయవాదుల పాత్ర కీలకమన్నారు. ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో టీటీడీపీ లీగల్‌సెల్ అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రతాప్ అధ్యక్షతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూయువత, కార్మికులు, ఉద్యోగులు టెక్నాలజీతో ఎలా ముందుకు వెళ్లాలో నిరూపించిన నేత చంద్రబాబు అని కాసాని పేర్కొన్నారు.