టీఎస్‌పీఎస్సీ లీకేజీలో మరో ముగ్గురికి బేడీలు

ABN , First Publish Date - 2023-05-26T03:20:14+05:30 IST

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ అధికారులు మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. తాజా

టీఎస్‌పీఎస్సీ లీకేజీలో మరో ముగ్గురికి బేడీలు

హైదరాబాద్‌ సిటీ, మే 25 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ అధికారులు మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. తాజా అరెస్టులతో మొత్తం నిందితుల సంఖ్య 43కు చేరుకుంది. తాజాగా పట్టుబడ్డ ముగ్గురూ సురేశ్‌ గ్యాంగ్‌కు చెందినవారే. వీరిలో ఉప్పల్‌కు చెందిన భరత్‌నాయక్‌, వరంగల్‌కు చెందిన పాసికంటి రోహిత్‌కుమార్‌, గాదె సాయి మధు ఉన్నారు. ఈ ముగ్గురికీ నకిరేకల్‌కు చెందిన పూల రవికిశోర్‌ ప్రశ్నపత్రాలను విక్రయించినట్లు సిట్‌ నిగ్గుతేల్చింది. అందుకు రూ. 3 లక్షల మేర ఒప్పందం కుదుర్చుకున్న భరత్‌, రూ.లక్ష అడ్వాన్స్‌ చెల్లించినట్లు ఆధారాలను సేకరించింది.

Updated Date - 2023-05-26T03:20:14+05:30 IST