చార్‌ధామ్‌ యాత్రలో విషాదం

ABN , First Publish Date - 2023-05-26T04:11:59+05:30 IST

చార్‌ధామ్‌ యాత్రలో విషాదం నెలకొంది. కేదార్‌నాథ్‌ వెళ్లేందుకు నడుస్తూ ఉండగా శ్వాస ఆడక నల్లగొండ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు

చార్‌ధామ్‌ యాత్రలో విషాదం

శ్వాస ఆడక నల్లగొండ జిల్లా వాసి మృతి

మిర్యాలగూడ రూరల్‌, మే 25: చార్‌ధామ్‌ యాత్రలో విషాదం నెలకొంది. కేదార్‌నాథ్‌ వెళ్లేందుకు నడుస్తూ ఉండగా శ్వాస ఆడక నల్లగొండ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు మృతిచెందాడు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాలకు చెందిన 40 మంది 20 రోజుల క్రితం చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లారు. ఇందులో మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడుకు చెందిన చౌగాని జీడికల్లు(63) కూడా ఉన్నాడు. యాత్రలో భాగంగా 14 రోజులు పూర్తికాగా, గురువారం కేదార్‌నాధ్‌ క్షేత్రానికి వెళ్లాల్సి ఉంది. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలోని కేదార్‌నాఽథ్‌ ఆలయానికి వెళ్లేందుకు గౌరికుండ్‌ ఎక్కుతుండగా మార్గమధ్యలో శ్వాస ఆడక జీడికల్లు మృతి చెందాడు. పక్కనఉన్న వారు సపర్యలు చేసినా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. మృతదేహాన్ని రుద్రప్రయాగ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు అక్కడి అధికారులతో మాట్లాడారు.

Updated Date - 2023-05-26T04:11:59+05:30 IST