3,06,42,333 రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య
ABN , First Publish Date - 2023-08-22T03:41:05+05:30 IST
మూడు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఓటరు జాబితా(డ్రాఫ్ట్)ను ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ విడుదల చేశారు.
1,53,73,066 మంది పురుషులు
1,52,51,797 మంది మహిళలు
జాబితా విడుదల చేసిన ఎస్‌ఈసీ
19 వరకు అభ్యంతరాల స్వీకరణ
సంబంధిత అధికారులను బదిలీ చేయొద్దు: సీఈవో వికాస్‌రాజ్
మూడు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఓటరు జాబితా(డ్రాఫ్ట్)ను ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ విడుదల చేశారు. సోమవారం ఆయన ప్రకటించిన జాబితా ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 3,06,42,333 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797మంది మహిళలు, ఽ2,133 మంది థర్డ్ జెండర్‌లు ఉన్నారు. 15,337 మంది సర్వీసు ఓటర్లు కూడా ఉన్నారు. కాగా, జాబితాకు సంబంధించిన ఏవైనా అభ్యంతరాలుంటే సెప్టెంబర్ 19 వరకు తెలియజేయవచ్చని వికాస్‌రాజ్ సూచించారు. అదేవిధంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియతో ముడిపడి ఉన్న ప్రభుత్వాధికారులను బదిలీ చేయొద్దని సంబంధిత విభాగాలను ఆదేశించారు.