నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి..
ABN , First Publish Date - 2023-09-02T01:49:32+05:30 IST
వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు సీఎం జగన్ శనివారం ఇడుపులపాయకు రానున్నారు. జయంతిలాగే వర్ధంతికీ జగన్, ఆయన
షర్మిలకు ఎదురుపడకుండా జగన్ షెడ్యూలు
కడప, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు సీఎం జగన్ శనివారం ఇడుపులపాయకు రానున్నారు. జయంతిలాగే వర్ధంతికీ జగన్, ఆయన సోదరి షర్మిల వేర్వేరుగా వైఎస్ కు నివాళులు అర్పించనున్నారు. షర్మిల, ఆమె తల్లి విజయలక్ష్మి బేగంపేట విమానాశ్రయం నుంచి శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఇడుపులపాయ చేరుకున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు వైఎస్సార్ ఘాట్‌లో నివాళులు అర్పించి షర్మిల తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నట్లు సమాచారం. జగన్ శనివారం ఉదయం 10:50కి హెలికాప్టర్‌లో ఇడుపులపాయ చేరుకుంటారు. 11:25 వరకు వైఎస్సార్ ఘాట్‌లో నివాళులు అర్పించనున్నారు. వెరసి... జగన్ తన తండ్రి జయంతితోపాటు వర్ధంతి కార్యక్రమంలోనూ షర్మిలకు ఎదురుపడకుండా ‘షెడ్యూలు’ నిర్ణయించుకోవడం గమనార్హం.