వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2023-06-11T01:18:44+05:30 IST

జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి.

 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

పలువురికి గాయాలు

చిట్యాలరూరల్‌, నాగార్జునసాగర్‌, నిడమనూరు, తిప్పర్తి, జూన 10: జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. చిట్యాల మండలంలోని పెద్దకాప ర్తి వద్ద ఈనెల 9వ తేదీ రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని హైదరాబాద్‌లోని ముసారాంబాగ్‌కు చెందిన పత్వార దశరథ(43) మృతి చెందా డు. గాంధీగుడికి వచ్చిన ఆయన రాత్రి గుడి ఎదురుగా నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడం తో నల్లగొండ ప్రభుత్వాత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ప్రమాదంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పో లీసులు తెలిపారు.

యువకుడి ప్రాణం తీసిన సైనబోర్డు

రోడ్డు వెంట పాతిన సైనబోర్డు(సూచిక బోర్డు) ఓ యువకుడి ప్రాణం తీసింది. ఫైలాన కాలనీకి చెందిన ఉదయ్‌ ప్రకా్‌ష్‌ (23) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో మోకానిక్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. శుక్రవారం అ ర్ధరాత్రి సాగర్‌లో తన స్నేహితుడి వివాహ వేడుకకు హజరై తిరిగి శనివారం ఉదయం తన ఇంటికి హిల్‌కాలనీ నుంచి ఫైలానకాలనీకి బైక్‌పై వెళ్తున్న క్రమంలో బొందలగడ్డ వద్ద రోడ్డు వెంట పాతిన సూచిక బోర్డును ఢీ కొట్టాడు. ప్రకాష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సురేష్‌ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం స్థానిక కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రకాష్‌ సోదరుడు సూర్యప్రకాష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

బంధువుల పెళ్లికి వచ్చి మృత్యువాత

బంధువుల పెళ్లికి వచ్చిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మిర్యాలగూడలోని గాంధీనగర్‌కు చెందిన పాలడుగు నాగరాజు కు టుంబ సభ్యులు నిడమనూరు మండలంలోని కోటమైసమ్మ ఆలయం వద్ద ఉన్న ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం జరిగే తమ బంధువు వివాహానికి వచ్చారు. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా సరుకులు తె చ్చేందుకు నాగరాజు కుమారుడు మురళికార్తికేయ(16)వరుసకు నాయనమ్మ అయిన రూతమ్మతో కలిసి బైక్‌పై ముకుందాపురం గ్రామానికి వె ళ్లాడు. తిరిగి ఫంక్షన్‌ హాల్‌కు వస్తుండగా కోటమైసమ్మ గుడి సమీపంలో మూలమలుపు వద్దకు రాగానే ఎదురుగా డీసీఎం వ్యాన్‌ వస్తుండటంతో బైక్‌ను నిలిపివేశాడు. మూలమలుపు కావడంతో అతివేగంగా దూసుకొచ్చిన డీసీఎంవ్యాన్‌ ము రళి కార్తికేయ మీదుగా దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌ను నిలిపివేసిన వెంటనే వెనుక కూర్చున్న రూతమ్మ బైక్‌ దిగి పరుగులు తీయడంతో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది. పెళ్లికి వచ్చి మృత్యువాత పడిన కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, బంధువులు విలపించారు. మురళికార్తికేయ తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శోభన్‌బాబు తెలిపారు.

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని...

తిప్పర్తి ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని గంగన్నపాలెం గ్రామానికి చెందిన మర్రి రాము (మూగ వ్యక్తి) తన భార్య సుమలతతో కలిసి బైక్‌పై తిప్పర్తికి బయలుదేరారు. అదే సమయంలో మాడ్గులపల్లి మండలం, గారెకుంటపాలెం గ్రామానికి చెందిన ఓ ద్విచక్ర వాహనదారుడు గంగన్నపాలెం వైపునకు అతి వేగంగా వచ్చి రా ము వెళ్తున్న బైక్‌ను ఢీకొన్నాడు. దీంతో రాము, అతని భార్యకు ఎదురు గా ఢీకొట్టిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్రాక్టర్‌- కారు ఢీ.. ఐదుగురికి గాయాలు...

పెద్దఅడిశర్లపల్లి: మండలంలోని ఘనపురం స్టేజీ సమీపంలో శుక్రవారం సాయంత్రం ట్రాక్టర్‌- కారు ఢీకొని ఐదుగురు గాయపడ్డారు. గుడిపల్లి ఎస్‌ఐ రంజితరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెం దిన ముత్తంగి శ్రీను, అతని భార్య ముత్తంగి పద్మ, కుమారుడు శ్రీకాంత, ముత్తంగి శ్రీను అన్న కుమారులు బ్రహ్మయ్య, ఓంకార్‌ ఏపీ రాష్ట్రంలోని కనిగిరి మండలం శంకారం గ్రామంలో జరిగిన శుభాకార్యానికి హాజరై తి రిగి కారులో హైదరాబాద్‌కు వెళ్తుండగా పీఏపల్లి మండలంలోని ఘనపు రం స్టేజీ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌, కారు రెండు ఢీకొన్నాయి. కారులో ఉన్న శ్రీనుకు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లా డు. మిగిలిన నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో 108లో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ కు తరలించారు. శ్రీను అన్న ముత్తంగి రమణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రంజితరెడ్డి తెలిపారు.

Updated Date - 2023-06-11T01:18:44+05:30 IST