నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు

ABN , First Publish Date - 2023-06-26T03:31:47+05:30 IST

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య, ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్‌ నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని సర్పంచ్‌ నవ్య హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ పీఎ్‌సలో సీఐ రమేశ్‌కు మరోసారి ఆదివారం ఫిర్యాదు చేశారు.....

నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు

బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి

రాజయ్య నుంచి ప్రాణహాని ఉంది

పోలీసులకు సర్పంచ్‌ నవ్య ఫిర్యాదు

ధర్మసాగర్‌, జూన్‌ 25: స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య, ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్‌ నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని సర్పంచ్‌ నవ్య హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ పీఎ్‌సలో సీఐ రమేశ్‌కు మరోసారి ఆదివారం ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల్లో తమ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె తెలిపారు. తన కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా ఎమ్మెల్యే, ఎంపీపీ, పీఏ శ్రీనివా్‌సదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు. వీరి బెదిరింపులకు తాను భయపడనన్నారు. ప్రెస్‌మీట్‌ పెట్టినప్పటి నుంచి 24 గంటలు నిరంతరం బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని తెలిపారు. ఆ ఫోన్‌ నంబర్లను పోలీసులకు అందజేశారు. తనను వేధింపులకు గురిచేసిన వారిపై కేసు నమోదు చేయాలని, రక్షణ కల్పించాలని సీఐకి విజ్ఞప్తి చేశారు. ఆధారాలు ఇస్తే పైఅధికారులతో చర్చించి విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. దీంతో వేధింపులకు సంబంధించిన కొన్ని ఫోన్‌ రికార్డింగ్‌లను సర్పంచ్‌ పోలీసులకు వినిపించారు. పోలీసులపై తనకు నమ్మకం ఉందన్నారు. న్యాయం జరగకపోతే కోర్టుకు వెళతానని, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని నవ్య తెలిపారు.

Updated Date - 2023-06-26T03:31:47+05:30 IST