మహిళా బిల్లు మోదీ నాటకం

ABN , First Publish Date - 2023-09-22T02:39:49+05:30 IST

దేశ వ్యాప్తంగా పడిపోయిన తన గ్రాఫ్‌ను తిరిగి నిలబెట్టుకునేందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు పేరిట ప్రధాని మోదీ నాటకానికి తెరలేపారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బి.వినోద్‌కుమార్‌ ఆరోపించారు.

మహిళా బిల్లు మోదీ నాటకం

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బి.వినోద్‌కుమార్‌

హనుమకొండ టౌన్‌, సెప్టెంబరు 21: దేశ వ్యాప్తంగా పడిపోయిన తన గ్రాఫ్‌ను తిరిగి నిలబెట్టుకునేందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు పేరిట ప్రధాని మోదీ నాటకానికి తెరలేపారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బి.వినోద్‌కుమార్‌ ఆరోపించారు. 2026 దాకా నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం లేకపోవడంతో మహిళా రిజర్వేషన్లు అమలు కావాలంటే 15 ఏళ్లు పడుతుందని చెప్పారు. ఈ మేరకు హనుమకొండలోని తన నివాసంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మహిళలను ఆకట్టుకునేందుకే బిల్లు తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-09-22T02:39:49+05:30 IST