మరో రూ.500 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం
ABN , First Publish Date - 2023-09-22T03:28:28+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.500 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నిర్వహించిన ఈ-వేలంలో సెక్యూరిటీ బాండ్లను కుదువ పెట్టి ఈ రుణాన్ని తీసుకుంది.
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.500 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నిర్వహించిన ఈ-వేలంలో సెక్యూరిటీ బాండ్లను కుదువ పెట్టి ఈ రుణాన్ని తీసుకుంది. ఏడేళ్ల కాల పరిమితి, 7.46 శాతం వార్షిక వడ్డీతో ఈ రుణం సేకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 ఏళ్ల కాల పరిమితి, 7.44 శాతం వార్షిక వడ్డీతో రూ.1,000 కోట్ల అప్పు తీసుకుంది.