పారిశ్రామిక రంగంలో ‘మీలా’ సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2023-06-26T01:08:02+05:30 IST

పారిశ్రామిక రంగంలో సుధాకర్‌ పీవీసీ వ్యవస్థాపకుడు మీలా సత్యనారాయణ చేసిన సేవలు మరువలేనివని సుధాకర్‌ పీవీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మీలా మహదేవ్‌ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో మీలా సత్యనారాయణ నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. వేలాదిమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ దేశంలోనే సుధాకర్‌ పీవీసీకి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహనీయుడు మీలా సత్యనారాయణ అని కొనియాడారు.

పారిశ్రామిక రంగంలో ‘మీలా’ సేవలు మరువలేనివి

సూర్యాపేటటౌన్‌, జూన్‌ 25: పారిశ్రామిక రంగంలో సుధాకర్‌ పీవీసీ వ్యవస్థాపకుడు మీలా సత్యనారాయణ చేసిన సేవలు మరువలేనివని సుధాకర్‌ పీవీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మీలా మహదేవ్‌ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో మీలా సత్యనారాయణ నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. వేలాదిమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ దేశంలోనే సుధాకర్‌ పీవీసీకి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహనీయుడు మీలా సత్యనారాయణ అని కొనియాడారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ సుధాకర్‌ పీవీసీని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. వ్యాపారరంగంలోనే కాకుండా సామాజిక, రాజకీయ, సేవా రంగాల్లో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని ఏర్పర్చుకున్న గొప్పవ్యక్తి సత్యనారాయణ అని, ఆయన ఆశయాలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో సుధా బ్యాంక్‌ ఎండీ పెద్దిరెడ్డి గణేష్‌, శర్మమూర్తి, శ్రీధర్‌, సుధాకర్‌ పీవీసీ ఉద్యోగులు, కార్మికులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T01:08:02+05:30 IST