హైదరాబాద్‌కు మారిన సీన్!
ABN , First Publish Date - 2023-05-27T03:19:32+05:30 IST
హమ్మయ్యా.. ఎట్టకేలకు వెళ్లిపోయారు. ఓ గొడవ వదిలిపోయింది’’.. కర్నూలు గాయత్రి ఎస్టేట్ చుట్టుపక్కల ప్రజలు, ఆస్పత్రుల నిర్వాహకులు, దుకాణదారులు, రోగులు, వారి బంధువులతోపాటు పోలీసులు ఇలా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

● ఊపిరి పీల్చుకున్న కర్నూలు.. అవినాశ్ తల్లి లక్ష్మమ్మ డిశ్చార్జ్
● హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స
కర్నూలు, మే 26 (ఆంధ్రజ్యోతి): ‘‘హమ్మయ్యా.. ఎట్టకేలకు వెళ్లిపోయారు. ఓ గొడవ వదిలిపోయింది’’.. కర్నూలు గాయత్రి ఎస్టేట్ చుట్టుపక్కల ప్రజలు, ఆస్పత్రుల నిర్వాహకులు, దుకాణదారులు, రోగులు, వారి బంధువులతోపాటు పోలీసులు ఇలా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి కారణం.. వారం రోజులపాటు కొనసాగిన ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుల హంగామాకు తెరపడటమే! గత శుక్రవారం అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మమ్మను గాయత్రి ఎస్టేట్‌లోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. ఆ రోజు నుంచే ఆయన అనుచరుల హల్‌చల్ మొదలైంది. అవినాశ్ అరెస్టును అడ్డుకునేందుకు కడప జిల్లా నుంచి వేలాదిమంది కర్నూలుకు వచ్చారు. ఆస్పత్రి ముందే బైఠాయించారు. మందు, విందుతో ఎంజాయ్ చేస్తూ.. కూలర్ల చల్లదనంతో మెత్తని కార్పెట్ల మీద కూర్చుని ‘నిరసన’లు కొనసాగించారు. చివరికి.. శుక్రవారం ఉదయం 10 గంటలకు అవినాశ్ తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం స్థిరం ఉందంటూ ఆమెను డిశ్చార్జ్ చేస్తున్నామని ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించారు. ఆమెకు మెరుగైన వైద్యం కోసం మరింత పెద్దాస్పత్రికి తీసుకెళ్లాల్సి ఉందంటూ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆ తర్వాత తల్లి లక్ష్మమ్మను ఎంపీ అవినాశ్‌రెడ్డి హైదరాబా ద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు.