ధాన్యం టెండర్ల ప్రక్రియ షురూ!

ABN , First Publish Date - 2023-08-22T03:12:59+05:30 IST

రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వద్ద పేరుకుపోయిన ధాన్యం నిల్వలను టెండర్ల ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిం ది.

ధాన్యం టెండర్ల ప్రక్రియ షురూ!

నేటి నుంచి బిడ్డింగ్‌.. సెప్టెంబరు 5 వరకు గడువు

హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వద్ద పేరుకుపోయిన ధాన్యం నిల్వలను టెండర్ల ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిం ది. దీంతో గ్లోబల్‌ ఈ-టెండర్‌ నిర్వహణకు సంస్థ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.అనిల్‌ కుమార్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం(22న) ఉదయం 10 గంటల నుంచి టెండర్‌ బిడ్డింగ్‌లు దాఖలు చేయొచ్చని, సెప్టెంబరు 5న మధ్యాహ్నం 3గంటల వరకు గడువు ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన బిడ్డర్లు తెలంగాణ ఈ-ప్రొక్యూర్మెంట్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని అనిల్‌ కుమార్‌ సూచించారు. రాష్ట్ర రైస్‌మిల్లర్లతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎగుమతిదారులు టెండర్లలో పాల్గొనే అవకాశాలున్నాయి. మొదటి విడతలో 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని టెండర్‌ సిస్టమ్‌ ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్‌ రైస్‌ తీసుకోకపోవటం, రారైస్‌ సీఎంఆర్‌కు మాత్రమే అనుమతిస్తుండటంతో యాసంగి ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Updated Date - 2023-08-22T03:12:59+05:30 IST