Share News

మంత్రి సోదరుడు దాడి చేశాడు

ABN , First Publish Date - 2023-12-03T03:50:53+05:30 IST

మంత్రి సోదరుడు శ్రీకాంత్‌గౌడ్‌ తనపై దాడికి పాల్పడ్డాడని, వెంటనే ఆయనను అరెస్టు చేయాలని పీఆర్‌టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్‌ టీచర్‌ గవినోళ్ళ వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

మంత్రి సోదరుడు దాడి చేశాడు

శ్రీకాంత్‌గౌడ్‌పై పీఆర్‌టీయూ మాజీ నేత వెంకట్‌రెడ్డి ఫిర్యాదు

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 2: మంత్రి సోదరుడు శ్రీకాంత్‌గౌడ్‌ తనపై దాడికి పాల్పడ్డాడని, వెంటనే ఆయనను అరెస్టు చేయాలని పీఆర్‌టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్‌ టీచర్‌ గవినోళ్ళ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరినందున తనపై కక్ష పెంచుకున్న శ్రీకాంత్‌గౌడ్‌ తన అనుచరులతో కలిసి శనివారం సాయంత్రం శ్రీనివాసకాలనీలోని కిరాణ దుకాణంలో సరుకులు తీసుకుంటుండగా తనపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. వెంటనే ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకులతో కలసి మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌ ముందు బైఠాయించి, రాస్తారోకో చేపట్టారు. గంట పాటు చేపట్టిన ఆందోళనతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో అడిషనల్‌ ఎస్పీ రాములు, డీఎస్పీ మహేశ్‌ అక్కడికి చేరుకొని, విచారణ చేపట్టి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. పోలీసుల హామీతో వారు ఆందోళన విరమించారు. వెంకట్‌రెడ్డి ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌పై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

రాజేందర్‌రెడ్డి ఇంటిపై బీఆర్‌ఎస్‌ నేతల దాడి

టీజేఏసీ మాజీ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి ఇంటిపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. శనివారం సాయంత్రం అతని ఇంటిపై పలువురు దాడిచేసి పూలకుండీలను పగులకొట్టారు. ఆ సమయంలో రాజేందర్‌రెడ్డి ఇంట్లో లేరు. దాడికి పాల్పడిన అనంతరం ఇంట్లో సీసీ కెమెరాలకు సంబంధించిన డిస్క్‌ను తీసుకెళ్ళారని, శ్రీకాంత్‌గౌడ్‌ తన అనుచరులతో వచ్చి దాడి చేశారని రాజేందర్‌రెడ్డి భార్య వనజ రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-12-03T03:50:54+05:30 IST