ఘనంగా ప్రారంభమైన ధారూరు మెథడిస్టు జాతర
ABN , First Publish Date - 2023-12-05T23:44:20+05:30 IST
క్రిస్టియన్ మెథడిస్టు జాతర ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మండలపరిధిలోని దోర్నాల్, ధారూరు స్టేషన్ గ్రామాల మధ్య కాగ్నా ఉపనది పక్కన ఉన్న జాతర ప్రాంగణంలో బిష్‌పలు ఎన్‌ఎల్ కర్‌కరే, ఎంఎ. డేనియల్‌లు ప్రధాన ముఖ ద్వారం వద్ద రిబ్బన్ కట్‌చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
ఉత్సవాలను ప్రారంభించిన బిష్‌పలు ఎన్‌ఎల్ కర్‌కరే, ఎంఎ. డేనియల్.
ఏసు ప్రభువు శిలువల వద్ద భక్తుల ప్రార్ధనలు
ధారూరు: ధారూరు క్రిస్టియన్ మెథడిస్టు జాతర ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మండలపరిధిలోని దోర్నాల్, ధారూరు స్టేషన్ గ్రామాల మధ్య కాగ్నా ఉపనది పక్కన ఉన్న జాతర ప్రాంగణంలో బిష్‌పలు ఎన్‌ఎల్ కర్‌కరే, ఎంఎ. డేనియల్‌లు ప్రధాన ముఖ ద్వారం వద్ద రిబ్బన్ కట్‌చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం యేసు ప్రభువు శిలువ వద్ద వారు ప్రార్ధనలు చేసి భక్తి పాటలు పాడుతూ ప్రధాన వేదిక వద్దకు వెళ్లారు. యేసు ప్రభువు శిలువ వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు నిర్వహించారు. కాగా బిష్‌పలకు జాతర కమిటీ నిర్వాహకులు ఘనస్వాగతం పలికి శాలువాలు, పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వేదిక పై నుంచి బిష్‌పలిద్దరు భక్తులకు యేసుక్రీస్తు శాంతి సందేశాన్ని వినిపించారు. యేసు ప్రభువు ఆశీర్వాచనాలతో భక్తులందరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధించారు. భజన బృందం సభ్యులు యేసు ప్రభువు పాటలు, కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో జాతర కమీటి నిర్వాహకులు దయానంద్, స్టీవెన్, పాస్టర్‌లు , భక్తులు పాల్గొన్నారు.
-