ఏడు నెలలకు బయటపడిన మృతదేహం

ABN , First Publish Date - 2023-03-31T00:22:35+05:30 IST

నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలంలో ఏడు నెలల క్రితం హత్యకు గురై కృష్ణానదిలో పడేసిన వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. వేసవితో నదిలో నీటిమట్టం తగ్గడంతో ఇనుపరాడ్లతో కలిపి వలలో చుట్టిన మృతదేహం బయటపడింది.

ఏడు నెలలకు బయటపడిన మృతదేహం
రాగ్య (ఫైల్‌ఫొటో)

ఏడు నెలలకు బయటపడిన మృతదేహం

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

మరో ఇద్దరి సహకారంతో కృష్ణానదిలో పడవేత

నిల్వ తగ్గడంతో మృతదేహం లభ్యం

నేరేడుగొమ్ము, మార్చి 30: నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలంలో ఏడు నెలల క్రితం హత్యకు గురై కృష్ణానదిలో పడేసిన వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. వేసవితో నదిలో నీటిమట్టం తగ్గడంతో ఇనుపరాడ్లతో కలిపి వలలో చుట్టిన మృతదేహం బయటపడింది. ఎస్‌ఐ రాజు, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మిర్యాలగూడ మండలం లావుడ్యతండాకు చెందిన ధా నావత రాగ్య ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ భార్య రోజాతో కలిసి హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, భార్య రోజాకు వరుసకు బావ అయ్యే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్టం మండలం ఎల్లమ్మతండాకు చెందిన లక్‌పతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి బంధానికి అడ్డువస్తున్నాడని రాగ్యను వదిలించుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. వీరు మరో ఇద్దరి సహకారంతో 2022 ఆగస్టు 19న రా గ్యకు మద్యం తాగించి కారులో నేరేడుగొమ్ము మండలం కాచరాజుపల్లి కృష్ణా పరివాహక ప్రాంతానికి తీసుకువచ్చారు. మద్యం మత్తు లో ఉన్న రాగ్యను హత్యచేసి మృతదేహనికి ఇనుపరాడ్లు కట్టి వలలో చుట్టి కృష్ణానదిలో పడేసి వెళ్లారు. అనంతరం ఇంటికి చేరుకున్న రో జా ఎవ్వరికీ అనుమానం రాకుండా తన భర్త కనిపించడంలేదని మ రుసటి రోజు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదుచేసింది. అదే సమయంలో మీ నాన్న నాతో గొడవపడి వెళ్లిపోయాడని పిల్లలను న మ్మించింది. రాగ్య కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన కుటుంబసభ్యులు కూడా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదుచేశారు. రోజా తీరును అనుమానిస్తూ ఆమెను విచారించాలని వారు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు విచారించగా, రాగ్యను హ త్య చేసి కృష్ణానదిలో పడేసినట్లు ఆమె ఒప్పుకుంది. అందుకు ప్రి యుడు లక్‌పతితో పాటు మానసింగ్‌, బాలాజీ అనే మరో ఇద్దరి సహకారం తీసుకున్నట్లు పోలీసులకు వి వరించింది. దీంతో మిగతా ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు రాగ్యను నీళ్లలో వేసిన నేరేడుగొమ్ము మండలం కృష్ణానది ప్రాంతానికి వెళ్లారు. గజ ఈతగాళ్లతో గత ఏడాది ఆగస్టు 22 నుంచి రెండు రోజుల పాటు గాలించినా మృతదేహం ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో రాగ్య హత్య చేసినందుకు రోజా, లక్‌పతి, మానసింగ్‌, బాలాజీలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు పంపించారు. కాగా, రెండు నెలల కిందట బెయిల్‌పై నిందితులంతా బయటకు వచ్చారు.

నదిలో నీటి మట్టం తగ్గడంతో....

వేసవి కావడంతో నేరేడుగొమ్ము మండలం కాచరాజుపల్లి సమీపంలోని కృష్ణానదిలో నీటిమట్టం తగ్గింది. ఈ క్రమంలో గురువారం గుర్తుతెలియని ఓ మృతదేహం తేలింది. ప్రతీ రోజూ చేపలు పట్టేందుకు వెళ్లే మత్స్యకార్మికులు దాన్ని గుర్తించి నేరేడుగొమ్ము పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ రాజు, సీఐ పరుశురాం అక్కడికి వెళ్లి కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. అది 2022 ఆగస్టు 19న కృష్ణానదిలో పడవేసిన రాగ్య మృతదేహంగా భావించి, ఆయన కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. రాగ్య తమ్ముడు రాజేష్‌, బావ మోహన, బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహం రాగ్యదిగా గుర్తించి బోరున విలపించారు. మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని, రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు ఎస్‌ఐ రాజు తెలిపారు. అక్కడి పోలీ్‌సస్టేషనలో రాగ్య హత్య కేసు నమోదైనందున రాయదుర్గం పోలీసులు వస్తేనే పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని ఎస్‌ఐ తెలిపారు. రాగ్య హత్యకు బాధ్యులపై కఠినచర్యలు తీసుకొని అతడి కుమారులకు న్యాయం చేయాలని బంధువులు డిమాండ్‌ చేశారు. కాగా, పోలీసులు ఇంకా నిందితులను అదుపులోకి తీసుకోలేదని తెలిసింది.

Updated Date - 2023-03-31T00:22:35+05:30 IST