Share News

నాడు సచివాలయంలోకి రానివ్వలేదు

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:09 AM

సరిగ్గా రెండు నెలల క్రితం సచివాలయం గేట్‌ ముందే సెక్యూరిటీ సిబ్బంది తనను అడ్డుకున్నారని, ఈ రోజు మంత్రిగా అక్కడి నుంచే పాలన అందిస్తున్నానని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

నాడు సచివాలయంలోకి రానివ్వలేదు

నేడు మంత్రిగా అక్కడి నుంచే పాలన

ఘనంగా మేడారం జాతర : మంత్రి సీతక్క

ములుగు, డిసెంబరు 17: సరిగ్గా రెండు నెలల క్రితం సచివాలయం గేట్‌ ముందే సెక్యూరిటీ సిబ్బంది తనను అడ్డుకున్నారని, ఈ రోజు మంత్రిగా అక్కడి నుంచే పాలన అందిస్తున్నానని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ప్రగతి భవన్‌ ఇనుప కంచెను బద్ధలు కొట్టి అంతరాలను తొలగించామని చెప్పారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదివారం ఆమె తొలిసారి సొంత నియోజకవర్గం ములుగులో పర్యటించారు. ములుగు మండలం మహ్మద్‌గౌ్‌సపల్లి వద్ద సీతక్కకు కాంగ్రెస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడి నుంచి ఊరేగింపుగా బయల్దేరిన ఆమె ములుగులో జరిగిన రోడ్‌ షోలో మాట్లాడారు. ములుగు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌ను అభివృద్ధికి నమూనాగా చూపిస్తూ బీఆర్‌ఎస్‌ పాలకులు మోసం చేశారని, ఆదిలాబాద్‌ నుంచి అచ్చంపేట వరకు దక్షిణ తెలంగాణ అంతా ప్రగతిలో వెనుకబడిందని తెలిపారు. సమ్మక్క-సారలమ్మల కీర్తి ప్రపంచానికి చాటేలా మేడారం జాతరను ఘనంగా జరిపిస్తామని సీతక్క అన్నారు. మేడారంలో వన దేవతల గద్దెలను దర్శించుకున్న ఆమె.. ఎత్తు బంగారం(బెల్లం) ఇచ్చి మొక్కులు సమర్పించారు. అనంతరం ఎంపీ మాలోత్‌ కవిత, జిల్లా అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.

Updated Date - Dec 18 , 2023 | 03:09 AM