telangana: ఇక నుంచి తలా 5 కిలోలే

ABN , First Publish Date - 2023-01-06T03:57:15+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పెట్టింది. కొత్త రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా అమలు చేస్తున్న 6 కిలోల బియ్యం పథకానికి

 telangana: ఇక నుంచి తలా 5 కిలోలే

రాష్ట్రంలో రేషన్‌ బియ్యం ఇక నుంచి తలా 5 కిలోలే

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న తీరులోనే అమలు..

తెలంగాణ వచ్చాక అదనపు కిలోతో 6 కేజీలు

భారం భరించలేక చేతులెత్తేసిన రాష్ట్ర సర్కారు..

రేపటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ

హైదరాబాద్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పెట్టింది. కొత్త రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా అమలు చేస్తున్న 6 కిలోల బియ్యం పథకానికి ముగింపు పలికింది. జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఇచ్చినట్లుగానే.. రాష్ట్ర ఆహార భద్రత కార్డులు కలిగిన వారికీ 5 కిలోల చొప్పునే ఇవ్వనున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన జాతీయ ఆహార భద్రత కార్డులకు 5 కిలోలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం మరో కిలో కలిపి 6 కిలోలు ఇచ్చేది. అలాగే రాష్ట్ర ఆహార భద్రత కార్డులకు 6 కిలోల చొప్పున ఇచ్చేది. ఇకపై అన్ని కార్డులపైనా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పునే బియ్యం పంపిణీ చేస్తారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ జారీచేసిన ఉత్తర్వులు పేద ప్రజలకు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. జనవరి నెల కోటా బియ్యాన్ని శనివారం (7వ తేదీ) నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల చొప్పున ఉచిత బియ్యం, అన్నపూర్ణ కార్డుదారులకు 10కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపి ణీ చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన.. 5,62,629 అంత్యోదయ కార్డులపై ఉన్న 15,15,137 మంది వినియోగదారులకు 35 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఏడాది పాటు అందనున్నాయి. అదేక్రమంలో 48,80,605 జాతీయ ఆహార భద్రత కార్డులపై ఉన్న 1,76,55,689మంది వినియోగదారులకు 5కిలోల చొప్పున ఉచిత బియ్యం అందుతాయి. రాష్ట్రంలో మొత్తం 54,43,234 జాతీయ ఆహార భద్రత కార్డుల (అంత్యోదయ కార్డులు కలిపి)లోని 1,91,70,826మంది వినియోగదారులకు గతంలో 3 రూపాయల చొప్పున వచ్చే బియ్యం కోటా.. ఇకనుంచి ఏడాదిపాటు ఉచితంగా వస్తాయి. దీంతో రాష్ట్రప్రభుత్వానికి 2రూపాయల సబ్సిడీ భారం, వినియోగదారులకు రూపాయి భారం తగ్గుతాయి.

91.69 లక్షల మందికి 5 కిలోల చొప్పున..

జాతీయ ఆహార భద్రత కార్డులకు అదనంగా రాష్ట్ర ప్రభు త్వం 35,71,410కార్డులు జారీచేసింది. ఈ కార్డులపై 91,69,050 మంది వినియోగదారులున్నారు. వీరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తోంది. కిలో బియ్యం విలువ రూ.32 కాగా.. ఒక రూపాయి వినియోగదారుల నుంచి తీసుకుంటూ.. రూ.31 సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఇకపై మొత్తం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి.. 91,69,050 మంది లబ్ధిదారులకు నెలకు 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుంది. రాష్ట్ర పభుత్వ పరిఽధిలో ఉన్న మరో 5,435 మంది అన్నపూర్ణ కార్డుదారులకు నెలకు 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏ(జాతీయ ఆహార భద్రత), ఎస్‌ఎ్‌ఫఎ్‌సఏ(రాష్ట్ర ఆహార భద్రత) కలిపి 90,14,928 కార్డులపై ఉన్న 2,83,39,876మందికి ఉచిత బియ్యం ప్రయోజనాలు అందుతాయి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం మే రకు ఈనెల నుంచి డిసెంబరు వరకు బియ్యం పంపిణీ చేస్తా రు. ఈ నెల కోటాను శనివారం నుంచి వినియోగదారులకు పంపిణీ చేయాలని రేషన్‌ డీలర్లకు, డీఎ్‌సవోలకు, జిల్లా కలెక్టర్లకు పౌరసరఫరాల కమిషనరేట్‌ నుంచి ఆదేశాలు వెళ్లాయి.

6 కిలోల పథకం కూడా కుదింపు

ఉమ్మడి రాష్ట్రంలో రేషన్‌ బియ్యం పంపిణీకి కొన్ని పరిమితులుండేవి. కిలోకు రూపాయి చొప్పున ఒక్కొక్కరికి 4 కిలోల బియ్యం మాత్రమే పంపిణీ చేసేవారు. కుటుంబంలో నలుగురి వరకే పంపిణీ చేయాలనే నియంత్రణ ఉండేది. దానిని కేసీఆర్‌ ప్రభుత్వం ఎత్తివేసింది. 2015 జనవరి నుంచి ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున పంపిణీ చేస్తామని ప్రకటించింది. అలాగే కుటుంబ సభ్యుల సంఖ్యపై పరిమితినీ తొలగించింది. కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున, కిలోకు రూపాయి చొప్పున పంపిణీ చేస్తూ వచ్చింది. ఆ సమయంలో జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు కేంద్రం 5కిలోలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలో కలిపి 6 కిలోలు ఇచ్చేది. అదేక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నిబంధనలు సడలించి రాష్ట్ర ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. వీటిపై ఉన్న వినియోగదారులకు కూడా 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తూ వచ్చింది. అనంతరం కొవిడ్‌ బియ్యం కోటాలోనూ మార్పులు చేయడం మొదలు పెట్టింది. మొదటి మూడు నెలలు మినహా ప్రతినెలకు 2కిలోల ఉచిత బియ్యాన్ని పేదలు నష్టపోతూ వస్తున్నారు. ఇప్పుడు మొత్తానికే 6 కిలోల పీడీఎస్‌ పథకానికి ముగింపు పలికింది. కేంద్ర ప్రభుత్వ కార్డుదారులకు కేంద్రం ఎంత బియ్యం ఇస్తుందో.. అంతే బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. దీంతో ఎవరి లబ్ధిదారులకు వాళ్లు 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నట్లు అవుతుంది.

Updated Date - 2023-01-06T12:10:33+05:30 IST