Share News

Telangana Ministers: కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయించారంటే..

ABN , First Publish Date - 2023-12-07T15:33:19+05:30 IST

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఆయనతో పాటూ 11మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. మంత్రులందరికీ సీఎం రేవంత్ రెడ్డి.. శాఖాలను కేటాయించారు

Telangana Ministers: కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయించారంటే..

హైదరాబాద్: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఆయనతో పాటూ 11మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. మంత్రులందరికీ సీఎం రేవంత్ రెడ్డి.. శాఖాలను కేటాయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోమ్ శాఖ కేటాయించారు. అలాగే మల్లు బట్టి విక్రమార్కకు రెవెన్యూ, కోమటిరెడ్డి వెంటకరెడ్డికి పురపాలక శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు, భవనాలు, పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఇరిగేషన్ శాఖ, శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ, జూపల్లి కృష్ణారావుకు పౌరసరఫాల శాఖ, పొన్నం ప్రభాకర్‌కు బీసీ సంక్షేమ శాఖ, కొండా సురేఖకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, దామోదర రాజనర్సింహకు ఆరోగ్య శాఖను కేటాయించారు.

ఇదిలావుండగా.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారు. రెండవ సంతకం దివ్యాంగురాలు రజనీ ఉద్యోగ నియామక పత్రంపై చేశారు.

Updated Date - 2023-12-07T15:42:35+05:30 IST