స్వామీ.. పనులు సాగేనా
ABN , First Publish Date - 2023-06-07T01:06:24+05:30 IST
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బస్వాపూ ర్ వద్ద నిర్మిస్తున్న నృసింహస్వామి రిజర్వాయ ర్ పనులు ముందుకు సాగడంలేదు. నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
నృసింహ సాగర్ రిజర్వాయర్ పరిహారం చెల్లింపులో జాప్యం
కాళేశ్వరం ప్యాకేజీ 15కింద 69శాతం
ప్యాకేజీ16లో 36శాతం పనులు పూర్తి
పూర్తిస్థాయి పరిహారం, పునరావాసానికి నిర్వాసితుల డిమాండ్
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బస్వాపూ ర్ వద్ద నిర్మిస్తున్న నృసింహస్వామి రిజర్వాయ ర్ పనులు ముందుకు సాగడంలేదు. నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. రిజర్వాయర్ పనులు పూర్తయినా, నీటిని నిల్వ చేయలేని పరిస్థితి. సముద్రమట్టానికి ఎత్తైన ప్రాం తం గా, నదీజలాల సదుపాయం లేని కరువు నేల జిల్లాకు గోదావరి జలాల మళ్లింపునకు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 15,16 ప్యాకేజీల కింద పనులు ప్రారంభించింది.
ఉమ్మ డి నల్లగొండ జిల్లాలో 2.50లక్షల ఎకరాలకు సాగునీటిని అందిం చే 16వప్యాకేజీలో భువనగిరి మండలం బస్వాపూర్ వద్ద నిర్మిస్తున్న నృసింహస్వామి రిజర్వాయర్ పూర్తిచేసి గోదావరి జలాలమళ్లింపు పనులు భూసేకరణ, పరిహారం చెల్లింపులో జాప్యం తో నిలిచిపోయాయి. 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణమవుతోన్న బస్వాపూర్ నృసింహస్వామి రిజర్వాయర్ పనులు ప్యాకేజీ-15కింద ఇప్పటివరకు 69 శాతంపనులు పూర్తి కాగా, ప్యాకేజీ 16పనులు 63 శాతం జరిగాయి.రిజర్వాయర్‌ను 42 మీటర్లఎత్తు, 495మీటర్ల వెడల్పుతో మూడు కిలో మీటర్ల పొడవు తో నిర్మిస్తున్నారు.11.39 టీఎంసీల సామర్థ్యం గల ఈ రిజర్వాయర్ నిర్మాణంలో ఇప్పటివరకు 480 మీటర్ల వెడల్పుతో రిజర్వాయర్ కట్టనిర్మాణం 75శా తం పూర్తిచేశారు. ఇప్పటివరకు ఈప్యాకేజీల పనుల కు రూ.155.69కోట్లు ఖర్చుచేశారు. ప్రధాన కాల్వలు,డిస్ర్టిబ్యూటరీ కెనాల్స్ నిర్మించాల్సి ఉంది.
నిర్వాసితుల ఆందోళన బాట
ఆరు నెలలుగా బీఎన్‌తిమ్మాపూర్, దాతర్‌పల్లి గ్రా మాలకు చెందిన రైతులు ప్రాజెక్టు వద్ద ఆందోళన బాటపట్డారు. రిజర్వాయర్ కోసం నోటిఫికేషన్ జారీచేసిన భూములకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించాలని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద వెంటనే పునర్నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నీటి నిల్వ చేసేందుకు బీఎన్‌తిమ్మాపూర్, దా తర్‌పల్లి గ్రా మాలను పునరావాస కేంద్రాలకు తరలించాల్సి ఉంటుంది.తమ భూములకు సం బంధించిన నష్టపరిహారంతో పాటు అర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించిన తర్వాతే గ్రా మాలను ఖాళీ చేస్తామని గ్రామస్థులు పట్టుబట్టారు. 2019లో రెవెన్యూ, అర్‌అండ్‌బీ అధికారులు బీఎన్ తిమ్మాపూర్‌లోని ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన స్ట్రక్చర్ వాల్యువేషన్ (ఇళ్ల కొలతలు)చేపట్టి అప్పటివరకు పరిహారం చెల్లించలేదు. అర్‌అండ్‌ఆర్ ప్యాకే జీ కింద ప్లాట్లను పంపిణీ చేయడంతో పాటు నిర్మాణానికి డబ్బులు చెల్లించినప్పటికీ, లేఅవుట్‌లో మౌ లిక వసతులు కల్పించలేదు. రిజర్వాయర్ నిర్మాణానికి బీఎన్ తిమ్మాపూర్‌లో 1,761 ఎకరాలకు 382, బస్వాపూర్‌లో 1,113 ఎకరాలకు 900 ఎకరాలు, వడపర్తిలో 445 ఎకరాలకు 285 ఎకరాలు సేకరించారు. జంగంపల్లిలో 740 ఎకరాలకు 129 ఎకరాలను సేకరించడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. మిగిలిన 611ఎకరాలకు సర్వే పనులు పూర్తి చేశారు. ప్రస్తు తం రిజర్వాయర్‌లో 8టీఎంసీల సామర్థ్యం మేరకు నీరు నింపేందుకు పనులు చేపట్టడానికి అవసరమై న భూ సేకరణ చేపట్టాల్సింది. రిజర్వాయర్ పనులు కొనసాగించేందుకు ప్రస్తుతం రూ.162 కోట్ల కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటిలో జంగంపల్లికి రూ.62కోట్లు, బీఎన్‌తిమ్మాపూర్‌కు రూ.100కోట్ల మేరకు ప్రతిపాదనలు జిల్లా యం త్రాంగం పంపింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిధులు మంజూరు చేస్తే గా ని పనులు చేపట్టాల్సిన పరిస్థితి. రిజర్వాయర్‌లోకి నీటి నిల్వ చేసేందుకు బీఎన్‌తిమ్మాపూర్, దాతర్‌పల్లి గ్రామాలను పునరావాస కేంద్రా లను తరలించాల్సి ఉంటుంది. తమ భూములకు సంబంధించిన నష్టపరిహారంతో పాటు అర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించిన తర్వాతనే గ్రామాలను ఖాళీ చేస్తామని గ్రామస్థులు పట్టుబడుతున్నారు.
4323.28 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ
రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వం 4323.28 ఎకరాలను నోటిఫికేషన్ జారీచేసింది. వీటిలో భువనగిరి మండలం బస్వాపూర్ 1022.39ఎకరాలు, బిఎన్ తిమ్మాపూర్‌లో 1760.11ఎకరాలు, వడపర్తిలో 468.56ఎకరాలు, హుస్సేనాబాద్‌లో 93.32ఎకరాలు, రుస్తాపూర్‌లో 270.54ఎకరాలు యాదగిరిగుట్ట మండ లం జంగంపల్లిలో 671.4ఎకరాలు, దాతర్‌పల్లిలో 30.11ఎకరాల వరకు ఉంది. 4323.28ఎకరాలకు 3981.03ఎకరాలకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించేందుకు గానూ అవార్డును పాస్ చేసింది. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో భూము లు కోల్పోతున్న వారిలో చిన్న,సన్నకారు రైతులతో పాటు పలుచోట్ల లేఅవుట్లలోని ప్లాట్ల యజమానులు కూడా ఉన్నారు. మొత్తం 6108మంది రైతులకు చెందిన 2602.39ఎకరాలకు రూ.352.92కోట్లు పరిహారం చెల్లించింది. మరో 342.17 ఎకరాలకు అవార్డు పాస్ చేసింది. ఇందుకు రూ. 222.49కోట్లు పరిహా రం చెల్లించాల్సి ఉంది. అవార్డు పాసైనప్పటికీ పరిహారం చెల్లించని రైతులు 5048రైతులు, ప్లాట్ల యజమానులకు సంబంధించిన 1378.21 ఎకరాలకు రూ.274.36కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం విడుదల చేసే నిధుల కోసం జిల్లాయంత్రాంగం ఎదురు చూస్తోంది.
భూమి సేకరించి పరిహారం మరిచారు : నర్సింహ, రైతు,బీఎన్ తిమ్మాపూర్ నిర్వాసితుడు
కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో బీఎన్ తిమ్మాపూర్ గ్రామం పూర్తిగా ముంపునకు గురవుతోంది. 2019లో బియన్ తిమ్మాపురం రెవెన్యూ పరిధిలో 134, 135 సర్వే నెంబర్‌లో ప్రాజెక్ట్ నిర్మాణం కోసం నా 9 ఎకరాల భూమి సేకరించారు. అందులో ఒక ఎకరానికి మాత్రమే రూ.15.26లక్షల పరిహారం చెల్లించారు. మిగతా 8 ఎకరాలకు పరిహారం చెల్లింపులో రెవెన్యూ, ప్రాజెక్ట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పరిహారం కోసం ప్రతిరోజూ తహసీల్దార్ కార్యాలయం చెట్టూ తిరుగుతున్నా.