సంజయ్‌ రౌత్‌పై పోలీసుల సుమోటో కేసు

ABN , First Publish Date - 2023-05-15T02:22:23+05:30 IST

మహారాష్ట్రలో ఉన్న ‘చట్ట వ్యతిరేక ప్రభుత్వ’ ఆదేశాలను అమలు చేయవద్దంటూ అధికారులను, పోలీసులను కోరిన శివసేన (ఠాక్రే) ఎంపీ సంజయ్‌ రౌత్‌పై పోలీసులు సుమోటోగా కేసు పెట్టారు.

సంజయ్‌ రౌత్‌పై పోలీసుల సుమోటో కేసు

శిందే ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయొద్దన్నందుకు ఎఫ్‌ఐఆర్‌

నాసిక్‌, మే 14: మహారాష్ట్రలో ఉన్న ‘చట్ట వ్యతిరేక ప్రభుత్వ’ ఆదేశాలను అమలు చేయవద్దంటూ అధికారులను, పోలీసులను కోరిన శివసేన (ఠాక్రే) ఎంపీ సంజయ్‌ రౌత్‌పై పోలీసులు సుమోటోగా కేసు పెట్టారు. శివసేనలోని రెండు వర్గాల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజున విలేకరులతో మాట్లాడిన రౌత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చట్టవ్యతిరేక ప్రభుత్వం కొససాగుతోందని, అది ఇచ్చే చట్టవ్యతిరేక ఆదేశాలను పాటించకూడదని అధికార వర్గాలను కోరారు. రాష్ట్రంలోని శిందే–ఫడణవీస్‌ ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలను సుమోటోగా పరిగణనలోకి తీసుకున్న నాసిక్‌ పోలీసులు ముంబయి నాకా స్టేషన్‌లో సుమోటోగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Updated Date - 2023-05-15T02:22:23+05:30 IST