Share News

విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-11-30T00:49:55+05:30 IST

పాలిటెక్నిక్‌ కళాశాలలో విదార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సాయంత్రం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

విద్యార్థి ఆత్మహత్య

వికారాబాద్‌, నవంబరు 29 : పాలిటెక్నిక్‌ కళాశాలలో విదార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సాయంత్రం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధి కొంపల్లి సమీపంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన రాజు(20) ఎలక్ర్టానిక్‌ కమ్యూనికేషన్‌ మూడోసంవత్సరం చదువుతున్నాడు. అయితే ఎన్నికల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ఇవ్వడంతో చాలా మంది విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లారు. అధ్యాపకులు ఎన్నికల విధుల్లో ఉండడంతో కొంతమంది విద్యార్థులు మాత్రమే హాస్టల్‌లో ఉన్నారు. అయితే బుధవారం సాయంత్రం కళాశాలలో వంట చేసే వ్యక్తి గదిలో రాజు ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించాడు. వెంటనే వంటమనిషి కళాశాల ప్రిన్సిపాల్‌ సంగమేశ్వర్‌కు సమాచారం అందించారు. ప్రిన్సిపాల్‌ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించి వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే వివరాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-11-30T00:49:57+05:30 IST