ఎంసెట్‌లో అర్హత సాధించలేకపోయానన్న మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-05-26T03:25:16+05:30 IST

ఎంసెట్‌ పరీక్షలో అర్హత సాధించలేక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకుని

ఎంసెట్‌లో అర్హత సాధించలేకపోయానన్న మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

తార్నాక, మే 25 (ఆంధ్రజ్యోతి): ఎంసెట్‌ పరీక్షలో అర్హత సాధించలేక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఓయూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. న్యూ నల్లకుంట ప్రాంతానికి చెందిన కునపులి శ్రీకృష్ణ చైతన్య(18) డీడీ కాలనీలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. గురువారం విడుదలయిన ఎంసెట్‌ ఫలితాలలో అర్హత సాధించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ బాధతో ఇంటి నుంచి ఓయూ ఠాగూర్‌ ఆడిటోరియం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకుని, వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటి పోసుకోని నిప్పంటించుకున్నాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కేకలు వేశాడు. అటుగా వెళ్తూ సంఘటనను గమనించిన వాటర్‌ పంప్‌ ఆపరేటర్‌ పోలీసులకు సమాచారం అందించాడు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ ప్రాణా లు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-05-26T03:25:16+05:30 IST