Share News

నిరంకుశ పోకడలకు వ్యతిరేక పోరాటాలు

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:56 PM

నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా పోరాటా లు సాగిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.

 నిరంకుశ పోకడలకు వ్యతిరేక పోరాటాలు
సమావేశంలో మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి

నిరంకుశ పోకడలకు వ్యతిరేక పోరాటాలు

దామరచర్ల, డిసెంబరు 17: నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా పోరాటా లు సాగిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టిన కాంగ్రెస్‌ ప్ర భుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను త్వరితగతిన అమలు చే యాలన్నారు. ప్రధాన సమస్యలను పరిష్కరించడంపై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పాలకులు పాటుపడాలని కోరారు. ఇక నిరంకుశ పాలన సాగిస్తున్న కేంద్రప్రభుత్వంపై పార్టీ తరపున ప్రజలతో కలిసి ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. ప్రజల మధ్య ఉంటూనే పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మండల కార్యదర్శి వినోద్‌నాయక్‌, ద యానంద్‌, శ్రీహరి, ఖాజా, పిచ్చయ్య, ఎర్రనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:56 PM