సత్తా చాటిన శ్రీచైతన్య
ABN , First Publish Date - 2023-05-26T03:21:58+05:30 IST
ఎంసెట్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులకు ఇంజనీరింగ్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్‌తోపాటు టాప్ 10లోపు 6

హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): ఎంసెట్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులకు ఇంజనీరింగ్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్‌తోపాటు టాప్ 10లోపు 6 ర్యాంకులు, అగ్రి, మెడికల్‌లో టాప్ 10లోపు 8 ర్యాంకులు వచ్చాయని విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో 100లోపు 60 ర్యాంకులు, అగ్రి, మెడికల్‌లో 100లోపు 70 ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారని తెలిపారు. ఎంసెట్ టాప్ ర్యాంకుల్లో 70 శాతం శ్రీచైతన్య విద్యార్థులవేనని అన్నారు.