‘శ్రీ చైతన్య’ ర్యాంకుల ప్రభంజనం

ABN , First Publish Date - 2023-06-15T02:59:26+05:30 IST

నీట్‌-2023 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. శ్రీ చైతన్య విద్యార్థి బోర వరుణ్‌ చక్రవర్తి... 720కి 720 మార్కులతో

‘శ్రీ చైతన్య’ ర్యాంకుల ప్రభంజనం

నీట్‌ ఓపెన్‌ కేటగిరీలో 1, 9, 14, 15 ర్యాంకుల కైవసం

1వ ర్యాంకర్‌కు రూ.25లక్షలు, 9వ ర్యాంకర్‌కు రూ.10లక్షలు అందజేసిన కళాశాల యాజమాన్యం

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): నీట్‌-2023 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. శ్రీ చైతన్య విద్యార్థి బోర వరుణ్‌ చక్రవర్తి... 720కి 720 మార్కులతో ఓపెన్‌ కేటగిరీలో ఆలిండియా 1వ ర్యాంకు సాధించారు. మరో విద్యార్థి ఎస్‌.వరుణ్‌ 715 మార్కులతో ఓపెన్‌ కేటగిరీలో 9వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. వీరితోపాటు శశాంక్‌ కుమార్‌, కంచని రఘురామ్‌ రెడ్డి.. వరుసగా 14వ, 15వ ర్యాంకులను దక్కించుకున్నారు. ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో టాప్‌-50 లోపు 9, టాప్‌-100లోపు 16 ర్యాంకులను శ్రీ చైతన్య విద్యార్థులు సాధించారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో బుధవారం కాలేజీ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఆలిండియా మొదటి ర్యాంక్‌ సాధించిన బోర వరుణ్‌ చక్రవర్తికి రూ.25 లక్షలు, 9వ ర్యాంక్‌ సాధించిన వరుణ్‌కు రూ.10లక్షల చెక్కును శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నీట్‌ -23 పరీక్షకు దేశవ్యాప్తంగా 20లక్షల మంది హాజరు కాగా, శ్రీ చైతన్య విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి ర్యాంకులు సాధించారన్నారు. నిష్ణాతులైన ఫ్యాకల్టీ సహకారంతో ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విధానాల్లో నాణ్యమైన శిక్షణ అందించడం వల్లే ఇంతటి అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక సిబ్బందిని శ్రీ చైతన్య విద్యా సంస్థల అధిపతి బీఎస్‌.రావు అభినందించారు.

Updated Date - 2023-06-15T02:59:26+05:30 IST