Share News

Sreelatha Reddy : మహిళలు, యువ ఓటర్లపై శ్రీలతారెడ్డి గురి..

ABN , First Publish Date - 2023-11-21T03:36:41+05:30 IST

బీజేపీ నుంచి పోటీ చేస్తున్న శ్రీలతారెడ్డి 2019 ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ ద్వారా రాజకీయ రంగ ప్రవేశంచేశారు.

Sreelatha Reddy : మహిళలు, యువ ఓటర్లపై శ్రీలతారెడ్డి గురి..

బీజేపీ నుంచి పోటీ చేస్తున్న శ్రీలతారెడ్డి 2019 ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ ద్వారా రాజకీయ రంగ ప్రవేశంచేశారు. బీఆర్‌ఎస్‌ హుజూర్‌నగర్‌ పట్టణ అధ్యక్షురాలిగా, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఈ ఏడాది అక్టోబరు మొదటివారంలోనే బీజేపీలో చేరి.. వెంటనే టికెట్‌ సాధించుకోగలిగారు. ఆర్థికబలం కలిగిన శ్రీలతారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న బీజేపీ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. యువత, మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె సోదరుడు పోరెడ్డి కిషోర్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు.

Updated Date - 2023-11-21T03:36:44+05:30 IST