Share News

జీవితానికి ‘ఆధ్యాత్మికత’ రాచబాట

ABN , First Publish Date - 2023-12-08T23:03:01+05:30 IST

సకల జీవవరాశులలో మానవ జన్మ పవిత్రమైందని, సంస్కారవంతమైన జీవితానికి ఆధ్యాత్మికత అనేది ఒక రాచబాట అని అఖిలాంధ్ర సాధు పరిషత అధ్యక్షురాలు వరావిద్యానందగిరి మాతాజీ అన్నారు.

జీవితానికి ‘ఆధ్యాత్మికత’ రాచబాట

అఖిలాంధ్ర సాఽధు పరిషత అధ్యక్షురాలు మాతా వరా విద్యానందగిరి

భూదానపోచంపల్లి, డిసెంబరు 8 : సకల జీవవరాశులలో మానవ జన్మ పవిత్రమైందని, సంస్కారవంతమైన జీవితానికి ఆధ్యాత్మికత అనేది ఒక రాచబాట అని అఖిలాంధ్ర సాధు పరిషత అధ్యక్షురాలు వరావిద్యానందగిరి మాతాజీ అన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి మూడురోజుల పాటు పట్టణంలోని మార్కండేశ్వరస్వామి దేవాలయం యతి కుటీరంలో ఆధ్యాత్మిక భక్త సమాజం చతుర్ధ వార్షికోత్సవం సందర్భంగా ఆత్మజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె భక్తులనుద్దేశించి ప్రతి రోజూ ఉదయం జగద్గురు శంకరాచార్య విరచిత ప్రాతఃస్మ రామిపై ప్రవచనాలు, సాయంత్రం శ్రీమద్భగవద్గీత భక్తిషట్కం 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ప్రవచించారు. గురువారం రాత్రి ఆత్మజ్ఞాన సదస్సు ముగింపు సందర్భంగా ఆమె భక్తులకు ఉపదేశమిచ్చారు. మానవుడు భక్తితో జీవితాన్ని ఆరంభించి ఆధ్యాత్మికతతో ముగించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు బడుగు చండీకేశ్వర్‌, ఉపాధ్యక్షుడు బోగ చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శి రుద్ర బాలరాజు, కోశాధికారి మంగళపల్లి రాజారమేష్‌, ఆధ్యాత్మిక భక్తసమాజం అధ్యక్షుడు భారత పురుషోత్తం, కటకం తుకారాం, చక్రాల నర్సింహ, నోముల అశోక్‌, సుంకి వెంకటేశంచ పుప్పాల నాగేశ్వర్‌, డాక్టర్‌ సీత సత్యనారాయణ, సీత రాములు, గంజి బాలయ్య, చిట్టిపోలు గోవర్ధన, ఎలగందుల రవీందర్‌, రుద్ర వెంకటయ్యతో పాటు భగవద్గీత సత్సంగమండలి, జైగురుదేవ్‌ సత్సంగమండలి, పాండురంగస్వామి భజనమండలి, ఆధ్యాత్మిక జ్ఞాన సత్సంగం ఆధ్వర్యంలో భజనలు నిర్వహించారు.

Updated Date - 2023-12-08T23:03:02+05:30 IST