Share News

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:08 PM

తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ మాయంక్‌ మిట్టల్‌ సూచించారు.

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ మాయంక్‌ మిట్టల్‌

- అదనపు కలెక్టర్‌ మాయంక్‌ మిట్టల్‌

మాగనూరు, డిసెంబరు 18: తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ మాయంక్‌ మిట్టల్‌ సూచించారు. సోమవారం మాగనూరు రైతు వేదికలో ఉమ్మడి మాగనూరు, కృష్ణ మండలాల్లోని ఉన్నత, ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఎఫ్‌ఎల్‌ఎన్‌పై సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. విద్యా వ్యవస్థలోని సమస్యలు, సాధించాల్సిన లక్ష్యాలను ఉపాధ్యాయులకు తెలియజేస్తూ విద్యార్థులు ఇబ్బంది పడుతున్న వాటిపై ప్రత్యేక దృష్టి సాధించాలని సూచించారు. గ్రంథాలయాల పీరియడ్‌ను తప్పక నిర్వహించాలని, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయులు టీచింగ్‌ డైరీని ప్రతీ రోజు రాయాలని, ఫోనిక్స్‌ సిబ్బంది సౌండ్‌ పదాల ఉచ్చరణ ద్వారా విద్యార్థులను సులభంగా ఇంగ్లిషు నేర్పించే విధానంపై మెలకులు తెలియజేశారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమం ద్వారా అలైన్మెంట్‌ తదితర వాటిపై డీఆర్పీలు వివరించారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి అబ్దుల్‌ గనీ, జిల్లా అకాడమీ మానిటరింగ్‌ అధికారి విద్యాసాగర్‌, సెక్టోరియా అధికారి శ్రీనివాసులు, ఎంఈవో వెంకటయ్య, నోడల్‌ అధికారులు పెంటయ్య, నిజము ద్దిన్‌, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు నర్సింలు, శివశంకర్‌, డీఆర్పీలు శ్రీనివాసులు, శ్రీకాంత్‌, భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రాజు, రాఘవేంద్ర, రషీద్‌, లక్ష్మణ్‌, భాస్కర్‌రెడ్డి, నరేందర్‌, రాజు, సీఆర్పీలు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:08 PM