Share News

Minister Ponguleti : సింగరేణి కార్మికులకు ఆరు గ్యారెంటీలు

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:36 AM

సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఆరు గ్యారెంటీలను రూపొందించి, వాటిని అమలు

Minister Ponguleti : సింగరేణి కార్మికులకు ఆరు గ్యారెంటీలు

ప్రత్యేకంగా రూపొందించి, అమలు చేస్తాం

కార్మికుల కోసం స్పెషల్‌ మ్యానిఫెస్టో: మంత్రి పొంగులేటి

కొత్తగూడెం, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఆరు గ్యారెంటీలను రూపొందించి, వాటిని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సింగరేణి కార్మికుల గుర్తింపుసంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరులో మంత్రి పర్యటించి, మాట్లాడారు. సింగరేణి కార్మికుల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టోను తయారు చేశామని తెలిపారు. ఉద్యోగులందరికీ సొంతింటి కల సాకారం చేసేందుకు 250 గజాల ఇంటి స్థలం, రూ.20 లక్షల వడ్డీలేని రుణాన్ని ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సింగరేణిలో నూతన భూగర్బ గనులను ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, కార్మికులపై విధిస్తున్న ఆదాయపు పన్నును రద్దు చేయిస్తామని, అన్ని ఏరియాల్లో సింగరేణి ఆస్పత్రులను ఆధునీకరించి మౌళిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కార్మికులంతా ఐఎన్‌టీయూసీకి పట్టం కట్టాలని మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు. ఆయనవెంట ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, ఐఎన్‌టీయూసీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 12:36 AM