10.89 లక్షల మంది రైతులకు రూ. 1,325.24 కోట్ల నగదు బదిలీ!
ABN , First Publish Date - 2023-06-29T02:42:53+05:30 IST
రైతుబంఽధు నగదు పంపిణీలో మూడో రోజైన బుధవారం, మూడెకరాల భూమి ఉన్న 10.89 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి..
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): రైతుబంఽధు నగదు పంపిణీలో మూడో రోజైన బుధవారం, మూడెకరాల భూమి ఉన్న 10.89 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 1,325.24 కోట్ల నగదును బదిలీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 50.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,246.42 కోట్లు జమచేసినట్లు ఆయన బుధవారం వెల్లడించారు. పెట్టుబడి అవసరాలకు రైతుబంధు సొమ్మును వినియోగించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.