శాలిగౌరారం ప్రాజెక్టు షట్టర్‌కు మరమ్మతులు

ABN , First Publish Date - 2023-06-03T01:11:32+05:30 IST

జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన శాలిగౌరా రం ప్రాజెక్టు కుడికాల్వ ప్రధాన షట్టర్‌ శిథిలమైందని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు చామల వెంకటరమణారెడ్డి స్వయంగా మరమ్మతులు చేయించారు.

 శాలిగౌరారం ప్రాజెక్టు షట్టర్‌కు మరమ్మతులు

శాలిగౌరారం ప్రాజెక్టు షట్టర్‌కు మరమ్మతులు

శాలిగౌరారం, జూన 2: జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన శాలిగౌరా రం ప్రాజెక్టు కుడికాల్వ ప్రధాన షట్టర్‌ శిథిలమైందని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు చామల వెంకటరమణారెడ్డి స్వయంగా మరమ్మతులు చేయించారు. నెల రోజుల క్రితం షట్టర్లు శిథిలమై నీరంతా వృథాగా పోయినా ఐబీ అధికారులు పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నాయకుడు చామల వెంకటరమణారెడ్డి తన సొంత నిధులతో షట్టర్లను మరమ్మతు చేయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయన్ను అభినందించారు.

Updated Date - 2023-06-03T01:11:32+05:30 IST