సీఎం సెక్రటరీగా షానవాజ్ ఖాసిం
ABN , First Publish Date - 2023-12-13T03:31:52+05:30 IST
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యదర్శిగా 2003 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసీం నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సంప్రదాయానికి భిన్నంగా ఐఏఎస్‌కు బదులు ఐపీఎ్‌స
ఐఏఎస్ ఆమ్రపాలికి త్వరలో కీలక పదవి?
హైదరాబాద్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యదర్శిగా 2003 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసీం నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం షానవాజ్ ఖాసీం మల్టీజోన్-2 ఐజీపీగా ఉన్నారు. కాగా, సీఎంలకు సెక్రటరీగా ఐఏఎస్ అధికారులను నియమించటం తొలి నుంచీ వస్తున్న సంప్రదాయంకాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఐపీఎస్ అధికారిని సెక్రటరీగా నియమించటం విశేషం. మరోవైపు, కొత్త ప్రభుత్వంలో కొందరు ఐఏఎ్‌సలకు కీలక బాధ్యతలు లభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏయే శాఖల్లో ఏయే అధికారులు ఉన్నారు, జిల్లాల్లో ఉన్న అధికారులు ఎవరనే దానిపై ప్రభుత్వ పెద్దలు ఆరాతీస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఐఏఎ్‌సగా సేవలందించి కేంద్ర సర్వీసులకు వెళ్లిన అధికారిణి ఆమ్రపాలికి ప్రభుత్వం కీలక పోస్టింగ్ ఇవ్వనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. సోమ, మంగళవారాల్లో వరుసగా రెండురోజులు ఆమ్రపాలి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. ఆమ్రపాలి తెలంగాణ నుంచి మూడేళ్ల క్రితం ప్రధానమంత్రి కార్యాలయం డిప్యూటీ సెక్రటరీగా బదిలీపై వెళ్లారు. కేంద్ర సర్వీసులో మూడేళ్లు పూర్తవడంతో ఆమె తాజాగా అక్కడి నుంచి రిలీవై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్టు చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. డైనమిక్ అధికారిణిగా పాలనలో తనదైన ముద్రవేసిన ఆమ్రపాలికి ప్రస్తుత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు లభించనున్నట్లు తెలుస్తోంది. ఆమ్రపాలి కేంద్ర సర్వీసులకు వెళ్లకముందు తెలంగాణలో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా, వరంగల్ అర్బన్ (ప్రస్తుతం హనుమకొండ) జిల్లా కలెక్టర్‌గా, వివిధ శాఖల్లో బాధ్యతలు నిర్వర్తించారు.