లక్ష గాజులతో ఏడుపాయల దుర్గామాత

ABN , First Publish Date - 2023-06-26T02:54:36+05:30 IST

ఆషాఢమాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకొని మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గాభవాని మాతను అర్చకులు లక్ష గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు.

లక్ష గాజులతో ఏడుపాయల దుర్గామాత

ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేక అలంకరణ

పాపన్నపేట, జూన్‌ 25: ఆషాఢమాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకొని మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గాభవాని మాతను అర్చకులు లక్ష గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్య స్నానాలు చేసి దుర్గామాతను దర్శించుకున్నారు. అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తల నీలాలు, బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో విందు భోజనాలతో, బంధు బలగంతో సందడి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సారా శ్రీనివాస్‌, ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. వేద పండితులు పార్థీవశర్మ, శంకరశర్మ, రాజశేఖర్‌శర్మ, రాముశర్మ, మురళీధర్‌ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాపన్నపేట ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌ ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు.

Updated Date - 2023-06-26T02:54:36+05:30 IST