శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి
ABN , First Publish Date - 2023-12-09T00:03:15+05:30 IST
విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఎంఈవో బాలాజీనాయక్ అ న్నారు.
శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి
మిర్యాలగూడటౌన, డిసెంబరు 8: విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఎంఈవో బాలాజీనాయక్ అ న్నారు. పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలాజీనాయక్ మాట్లాడుతూ సైన్సపై ఆసక్తి పెంచుకుంటే భవిష్యత్తులో చక్కని ఆవిష్కరణలు చేయవచ్చని అన్నారు. స్కూల్ లెవల్ నుంచే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిసీ్ట్రలపై పట్టు సాధించాలని సూచించారు. ఇంటర్ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స, రో బోటిక్స్, మిషన లెర్నింగ్ తదితర సాంకేతిక పాఠ్యాంశాలను ఎ దుర్కోవాలంటే పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు ప్రతిభా సామర్థ్యాలు మెరుగుపరుచుకోవాలని అన్నారు. ట్రస్మా జిల్లా కార్యదర్శి గాదె రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ టెక్నికల్ స్కిల్స్ ఉన్న విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం అవుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణాంశాలతో విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలు ఆకట్టుకోగా ప్రదర్శలను తిలకించిన విద్యావేత్తలు విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కేకే. జయరాజన, విద్యావేత్త మారుతి అమరేందర్‌రెడ్డి, ఝాన్సీ, వినీ్‌షకుమార్, మధునాయర్, శంకర్, వినోద్‌చంద్రన, పద్మావతి, జ్యోతి, సరిత, పద్మ, నాగు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.