ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకు అడుగు దూరంలోనే
ABN , First Publish Date - 2023-11-10T04:13:25+05:30 IST
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కేవలం అడుగు దూరంలోనే ఉందని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణమాదిగ అన్నారు.
రేపు పరేడ్‌గ్రౌండ్‌లో విశ్వరూప మహాసభ.. మోదీ హాజరు: మందకృష్ణమాదిగ
బర్కత్‌పుర, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కేవలం అడుగు దూరంలోనే ఉందని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణమాదిగ అన్నారు. మూడు దశాబ్దాల మాదిగ దండోరా ఉద్యమ కల ఫలించబోతోందన్నారు. 11న పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సభకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇరత రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది మాదిగ, మాదిగ ఉప కులాల వారు తరలివస్తున్నారని చెప్పారు. గురువారం బషీర్‌బాగ్ బాబుజగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు దండోరా డప్పుల చాటింపు కార్యక్రమం నిర్వహించారు. మందకృష్ణమాదిగ కూడా స్వయంగా డప్పు కొడుతూ చాటింపు వేశారు.