కాంట్రాక్టు లెక్చరర్లకు తక్షణం జీతాలు చెల్లించాలి: రేవంత్
ABN , First Publish Date - 2023-09-07T03:25:05+05:30 IST
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు అయిదారు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని టీపీసీసీ
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు అయిదారు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రతినెలా సకాలంలో జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని ఆయన కోరారు.